పుష్ప 2 ఇలా సాగుతోందట

సుకుమార్ స్క్రిప్ట్ విషయంలోనే కాకుండా ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఒకే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు.

Update: 2024-08-04 07:10 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రాన్ని మూడేళ్లుగా షూట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా పార్ట్ షూటింగ్ పెండింగ్ లో ఉందంట. ఈ కారణంగానే ఆగష్టు 15కి అనుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 6కి వాయిదా పడింది. సుకుమార్ స్క్రిప్ట్ విషయంలోనే కాకుండా ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఒకే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు.

వాటిలో బెస్ట్ గా ఉన్నవాటిని ఫైనల్ గా ఒకే చేయించుకుంటున్నారు. టాలీవుడ్ మోస్ట్ పెర్ఫెక్షనిస్ట్ గా సుకుమార్ కి పేరుంది. ఆర్టిస్ట్స్ నుంచి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని రాబట్టుకునేంత వరకు విశ్రమించరు. అందుకే సుకుమార్ సినిమా షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. పుష్ప2కి మాత్రం ఇప్పటి వరకు చేసిన సినిమాలకంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 వస్తోంది.

మొదటి సినిమా విషయంలో జరిగిన తప్పులు పుష్ప ది రూల్ లో రిపీట్ కాకూడదని ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. గత నెల పుష్ప ది రూల్ మూవీపై సోషల్ మీడియాలో విపరీతమైన గాసిప్స్ వినిపించాయి. అల్లు అర్జున్, సుకుమార్ కి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని తరువాత తేలింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ బ్యూటీ పుష్ప ది రూల్ మూవీపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె పుష్ప 2 సినిమాలో సాంగ్ షూటింగ్ కి సంబందించిన ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకుంది. ఓ సాంగ్ లో డాన్స్ మూమెంట్స్ చాలా కష్టమైందని రష్మిక తెలిపింది. హ్యాండ్ మూమెంట్స్ ని కెమెరా లెన్స్ లో బంధించడం కష్టంగా మారింది. ఆ డాన్స్ మూమెంట్ పెర్ఫెక్షన్ కోసం సుకుమార్ గారు కొన్ని గంటల పాటు షూట్ చేశారని ఆమె వివరించింది.

అయితే అలాంటి చిన్న డాన్స్ స్టెప్స్ కోసం కూడా సుకుమార్ గంటల కొద్ది సమయం తీసుకుంటే సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్ గా తీసుకొని నెమ్మదిగా షూట్ చేస్తే డిసెంబర్ లో కూడా రిలీజ్ కావడం కష్టం అని అంటున్నారు. క్వాలిటీ పరంగా ప్రేక్షకులకి బెస్ట్ ఇవ్వడం తప్పులేదు కానీ మరీ టూమచ్ గా వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News