స్క్రీన్ ప్లే ఎలా రాయోచ్చో? ఆ సినిమా చూస్తే సరి!
వారిద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు చూపించి.. వాళ్ల పెళ్లికి వీళ్లిద్దరు అంగీకరిస్తారా? అనే ఎలింమెంట్ తో ఆసక్తిని తీసుకొచ్చారు.
విజయ్ దేవరకొండ-సమంత జంటగా శివ నిర్వాణలో తెరకెక్కిన `ఖుషీ` సినిమాకి డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి శివ మార్క్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అయినా ఆస్థాయి విజయాన్ని అందుకో లేకపోయింది. తాజాగా ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు.
'ఖుషీ అనగానే విజయ్..పవన్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రేమలో పడటానికి ముందు.. ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి అయ్యాక ఒక జంట మధ్య ఎలాంటి గొడవలొచ్చాయి అనే మంచి కథతో సినిమా సిద్దమైంది. ఇది పాజిటివ్ ఫిల్మ్. నటులందరు బాగా నటించారు. సమంత-విజయ్ ల్ని మెచ్చుకోవాలి. నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసారు. అబ్బాయి- అమ్మాయి కథలో ఈ చిత్రాన్ని చెబుతూనే వారి తల్లిదండ్రుల కథగానూ దీన్ని చూపించారు.
వారిద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు చూపించి.. వాళ్ల పెళ్లికి వీళ్లిద్దరు అంగీకరిస్తారా? అనే ఎలింమెంట్ తో ఆసక్తిని తీసుకొచ్చారు. ప్రేమ విషయంలో పెద్దల్ని ఎలా ఒప్పించారు? అన్నది ట్విస్ట్ గా చూపించారు. ప్రధమార్దం కామెడీ బాగుంది. నటీనటుల మధ్య చీటింగ్ కథనాన్ని రాసారు. హీరో..హీరోయిన్ల మధ్య లవ్ డెవలప్ కాకపోయి ఉంటే? అది అన్ వాంటెడ్ డ్రామా అయ్యేది. సెకెండాఫ్ ల్యాగ్ ఉంది.
ఇది పెర్మార్మెన్స్ ఓరియేంటెడ్ ఫిల్మ్. సూపర్ హిట్ సినిమా పేరు పెట్టి అద్భుతమైన నటనతో ఇలాంటి సినిమా క్రియేట్ చేయడం సవాల్ తో కూడుకున్న పనే. కథ చిన్నదే కానీ దాదాపు 2.40 గంటలు నడిపిం చడం అన్నది సులభమైన పనికాదు. క్లైమాక్స్ లో పిల్లలు కోసం తల్లిదండ్రులు మనసు మార్చుకోవడం చూపించారు.
దేవుడు ఉన్నాడా? లేడా? అన్న అంశంపై ఎన్నో సినిమాలొచ్చాయి. అదే కథాంశాన్ని మోడ్రన్ గా ఎలా చూపించవచ్చో? శివ ఈ సినిమాతో తెలియజేసాడు. అలాగే చిన్నపాయింట్ పై కథనాన్ని ఎలా రాయొచ్చో? ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది' అని అన్నారు.