ప్రియురాలిని పెళ్లాడుతున్న స్టార్ హీరో?

బాలీవుడ్‌లోని హాటెస్ట్ క‌పుల్ పెళ్లి శుభ‌వార్త చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.

Update: 2024-07-18 06:13 GMT

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ - సబా అజాద్ ప్రేమాయ‌ణం నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌ ఈ సంవత్సరం వివాహం చేసుకోనున్నార‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. బాలీవుడ్‌లోని హాటెస్ట్ క‌పుల్ పెళ్లి శుభ‌వార్త చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.

శుభ‌ముహూర్తానికి వేళ‌యింది అనేందుకు సింబాలిక్ గా సాబా ఆజాద్ తాజా ఇన్ స్టా పోస్ట్ కి హృతిక్ స్పంద‌న అగ్నికి ఆజ్యం పోసింది. సాబా ఎంతో ఎమోష‌న‌ల్ గా `రివీలింగ్ నూన్` (మ‌ధ్యాహ్నం బ‌య‌ట‌పెట్టేస్తా) అని పోస్ట్ చేయ‌గా, దానికి స్పందించిన హృతిక్ `ఆగ‌లేక‌పోతున్నాను`! అని ఉద్వేగానికి లోన‌య్యాడు. దీన‌ర్థం ఈ జంట పెళ్లి కోసం ఆగ‌లేక‌పోతోంద‌నే! అంటూ అభిమానులు కోర‌స్ పాడుతున్నారు. ఏది ఏమైనా సాబా-హృతిక్ పెళ్లాడే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ జంట సాన్నిహిత్యం త్వ‌ర‌లోనే శుభ‌వార్త‌గా మారుతుంద‌ని కూడా ముచ్చ‌ట సాగుతోంది.

నిజానికి హృతిక్ తన మాజీ భార్య సుజానే ఖాన్‌తో విడిపోయినప్పటి నుండి మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదా సంబంధం గురించి మాట్లాడలేదు. కానీ సబాతో అత‌డి బంధం స‌మున్న‌త‌మైన‌ది. తన సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని అత‌డు ప్లాన్ చేస్తున్నాడని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇటీవ‌ల ఈ జంట తమ‌ సంబంధంపై సీరియస్ గా ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సబా రోషన్ల నుండి కూడా అంగీకారం పొందింది. ఆమె హృతిక్ తల్లి పింకీ, సోదరి సునైనా, కజిన్ పష్మీనాకు అత్యంత‌ సన్నిహితురాలిగా మెలుగుతోంది. రోష‌న్ కుటుంబంతో కలిసిపోతోంది స‌బా. తరచుగా పుట్టినరోజులు ఇత‌ర వేడుక‌లకు హాజరవుతుంది. తక్కువ వ్యవధిలో హృతిక్- సబా మ‌ధ్య బాండింగ్ బ‌ల‌ప‌డింది. వారి ఇస్టాగ్రామ్ పోస్ట్‌లతో ప్రధాన జంట లక్ష్యాలను అందిస్తున్నారు. అందుకే ఈ పెళ్లికి స‌మ‌య‌మాస‌న్న‌మైంద‌నే ఊహాగానాలు మ‌రింత‌గా ఊపందుకున్నాయి. హృతిక్ ప్ర‌స్తుతం వార్ 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. స‌బా త‌న సింగింగ్ అసైన్ మెంట్స్ తో బిజీగా ఉంది.

Tags:    

Similar News