మాజీలిద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుంటారా?
హృతిక్ రోషన్-సుస్సానే ఖాన్ విడిపోవడం కొత్త వారిని జీవితంలోకి పరోక్షంగా ఆహ్వానించిడం జరిగింది
హృతిక్ రోషన్-సుస్సానే ఖాన్ విడిపోవడం కొత్త వారిని జీవితంలోకి పరోక్షంగా ఆహ్వానించిడం జరిగింది. హృతిక్ , షబా అజాద్ తో రిలేషన్ షిప్ లో ఉండగా, సుస్సాన్ ఖాన్ ఆర్సాలాన్ గ్లోనీతో బాండింగ్ లోనూ ఉంది. మాజీ భార్య భర్తలిద్దరు పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన అన్నిరకాల బాద్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితులుగా కలిసి తల్లిదండ్రులుగా సేవలందిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.
మరి కొత్త భాగస్వాములతో జర్నీ ఎంత వరకూ వచ్చింది అంటే? త్వరలో రెండు జంటలు పెళ్లికి రెడీ అవుతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. ఇటీవలే సుస్సాన్ ఖాన్ తల్లి జరీన్ ఖాన్ కుమార్తె రిలేషన్ షిప్ గురించి సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఎంతో సంతోషం గా ఉన్నారని, వాళ్లు పెళ్లి చేసుకోకపోయినా తాను సంతోషంగా ఉంటాన నని..కలిసి ఉండటానికి పెళ్లి అవసరం లేదని జరీన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తల్లి ఇంతలా ఓపెన్ అవ్వడంతో సుస్సాన్ ఖాన్ కూడా పెద్దల్ని గౌరవించి వివాహానికి రెడీ అవుతుందని బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం తెరపైకి వచ్చింది. కుమార్తెగా తల్లి కోరికను నిర్వర్తించడం కూడా ఓ బాధ్యతగా భావించి సుస్సాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెలుగులోకి వస్తోంది. అలాగే హృతిక్ రోషన్ క కూడా ప్రియురాల్ని పెళ్లాడుతున్నాడని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకూ అది జరగలేదు. తాజాగా సమయం దగ్గర పడినట్లే కనిపిస్తోంది.
తాజాగా షబానా తన ఇన్ స్టా ఖాతాలో రివీలింగ్ సూన్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దానికి హృతిక్ ఆగలేక పోతున్నానని రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వచ్చిన ఆ డిస్కషన్ పెళ్లికి సంబంధించిందని అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో మాజీలిద్దరు ఒకేసారి ముహూర్తం పెట్టుకుని ప్రేమించిన వారిని పెళ్లాడు తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.