వార్ 2 - హీరో దెబ్బతో మరో షాక్ ఇవ్వరుగా?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువమంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో వార్ 2 కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

Update: 2024-02-15 10:02 GMT

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువమంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో వార్ 2 కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేవిధంగా హైప్ అయితే క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.


టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ మొదటి పార్ట్ లో నటించిన విధానం బాక్సాఫీస్ వద్ద అలజడిని సృష్టించింది. ఇక ఈసారి తారక్ ఎంట్రీ తో భూకంపం వస్తుంది అని చెప్పవచ్చు. అంతలా వార్ 2 సినిమాపై మంచి బజ్ అయితే ఉంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలుపెట్టేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్క ప్రణాళికతో సినిమాను ఒక ఏడాదిలోనే ఫినిష్ చేయాలని ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నాడు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు సంబంధించిన డేట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఇక్కడ బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా కు బ్రేక్ పడినట్లుగా కొన్ని గాసిప్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ ఫా హృతిక్ రోషన్ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆ విషయంపై హీరో కూడా క్లారిటీ ఇచ్చేసాడు.

క్రచెస్ సహాయంతో నిలబడిన హృతిక్ రోషన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోలుకుంటున్నానని కూడా అతను వివరణ ఇచ్చాడు అయితే ఈ గాయం ఎలా అయింది ఎన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అతను మాత్రం వీలైనంత తొందరగా వార్ 2 షూట్ లో మాత్రం పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఇప్పుడు గాయం కారణంగా మళ్ళీ షెడ్యూల్లో ఏమైనా మార్పులు జరుగుతాయేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అదే జరిగితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మళ్లీ తారక్ కొత్త డేట్స్ ఇవ్వాలి అంటే వద్ద సులువైన విషయమేమీ కాదు. ఎందుకంటే మరొకవైపు దేవర సినిమా షూటింగ్ కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.

దానికి కూడా సీక్వెల్ రానుంది కాబట్టి ఎన్టీఆర్ వార్ 2 కోసం ముందుగానే తనకు అనుకూలమైన డేట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు హృతిక్ రోషన్ గాయం కారణంగా ఆలస్యమైతే మరింత ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవచ్చు. లేదంటే కొంతకాలం ఎదురు చూడక తప్పదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News