వైఫ్ అండ్ హజ్బెండ్ లా ఈ జోడీ సూపర్బ్!
హృతిక్-సబా అమెరికన్ రచయిత స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ - అతని భార్య పెయింటర్ మరియు రచయిత్రి అయిన జేల్డా ఫిట్జ్‌గెరాల్డ్ లాగా ముస్తాబయ్యారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-సబా ఆజాద్ మధ్య రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. అధికారంకంగా వ్యవహారం పబ్లిక్ కాదు గానీ...ఇద్దరు చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటున్నట్లు ఎప్పటికప్పుడు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఈ జోడీ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ ఘట్టం ఇంకా జరగలేదు గానీ..అంతకు ముందే ఇలా వైఫ్ అండ్ హజ్జెండ్ లా మాత్రం నెట్టింట సంచలనం అవుతున్నారు.
హృతిక్-సబా అమెరికన్ రచయిత స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ - అతని భార్య పెయింటర్ మరియు రచయిత్రి అయిన జేల్డా ఫిట్జ్‌గెరాల్డ్ లాగా ముస్తాబయ్యారు. హృతిక్ తెలుపురంగు షర్ట్.. చారల బూడిదరంగు ప్యాంటు ధరించి బ్లాక్ బెల్ట్ తో టక్ చేసాడు. తలకి రౌండ్ టోపీ వేసుకున్నాడు. ఆపక్కనే సబా కూడా అంతే అందంగా ముస్తాబైంది. మిరుమిట్టు గొలిపే ఔట్ ఫిట్.. దాన్ని మ్యాచ్ చేస్తు నెక్ పై నెక్లెస్.. హెడ్‌బ్యాండ్ - బ్యాంగిల్స్‌తో వెండి దుస్తులలో మెరిసిపోతుంది.
చేతికి నల్లటి సాక్సులు.. మరో చేతిలో సిగరెట్ హోల్డర్ గమనించొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. మరి ఈ జోడీ ఇలా ముస్తాబవ్వడం వెనుక కారణం ఏంటి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. శుక్రవారం హృతిక్ కజిన్ పష్మీనా రోషన్ పుట్టినరోజు వేడుక కోసం ఆ జోడీ ఇలా ముస్తాబై సర్ ప్రైజ్ చేసారు. ఆ సెలబ్రేషన్ కి చెందిన ఫోటోలన్నింటిని హృతిక్ స్వయంగా షేర్ చేసాడు.
పార్టీలోని అతిథులందరితో గ్రూప్ ఫోటో మొదటిది కాగా... ఈ గ్యాంగ్ లో హృతిక్, సబా - పష్మీనా తండ్రి - సంగీత స్వరకర్త రాజేష్ రోషన్ ఉన్నారు. చివరి స్నాప్ లోహృతిక్ - సబా వివిధ భంగిమలో కెమెరాకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రేక్షకుల్నే కాదు బాలీవుడ్ సెలబ్రిటీల్ని ఈ ఫోటోల్ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. హృతిక్-సబా వైవిథ్యంగా ముస్తాబవ్వడమే పుట్టిన రోజు స్పెషల్ గా కనిపిస్తుంది.