పుష్ప 2: అల్లు అర్జున్ నెక్ట్స్ లెవ‌ల్ చూపిస్తాడు

2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో `పుష్ప 2` ఒకటి. రాజీ అన్న‌దే లేకుండా షూటింగ్ కోసం సుకుమార్ అండ్ టీమ్ చాలా శ్ర‌మించారు.

Update: 2024-10-12 04:04 GMT

2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో `పుష్ప 2` ఒకటి. రాజీ అన్న‌దే లేకుండా షూటింగ్ కోసం సుకుమార్ అండ్ టీమ్ చాలా శ్ర‌మించారు. నిర్మాత‌లు రాజీ లేకుండా పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమాతో 1000 కోట్ల క్ల‌బ్ అందుకోవాల‌నే పంతం అల్లు అర్జున్ అండ్ టీమ్‌లో బ‌లంగా ఉంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టే పుష్ప 2 కి హైప్ ఉంది. పుష్ప -1 పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిల‌వ‌డంతో పార్ట్ 2 పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వాటిని రీచ్ అయ్యేలా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ఎఫ‌ర్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాది బెల్ట్ లో రీచ్ కోసం ఈ సినిమాలో అద్భుత‌మైన ఎలివేష‌న్స్ ని ప్లాన్ చేసారు.

నిజానికి ఇది ఒక నెగెటివ్ షేడ్ ఉన్న హీరో క‌థ‌. పుష్ప‌రాజ్ పెద్ద స్మ‌గ్ల‌ర్. అల్లు అర్జున్ పాత్ర నెగటివ్ టచ్‌తో ఉన్నా అది అంద‌రికీ క‌నెక్ట‌యింది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో బన్నీ న‌ట‌న‌, ఆహార్యం మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చింది. ఇప్పుడు పార్ట్ 2లో అంత‌కుమించి అనే రేంజులో దిగ్గ‌జాల‌ను ఢీకొట్టే స‌మ‌ర్థుడైన‌ స్మగ్లర్‌గా బ‌న్ని న‌టించాడు. అంతేకాదు.. పార్ట్ 1 లో ఎలా ఆక‌తాయి స్మ‌గ్ల‌ర్ గా క‌నిపించాడో, అంత‌కుమించి ఇప్పుడు పార్ట్ 2లోను సుకుమార్ ఒక ఆకతాయి కుర్రాడిగానే చూపించనున్నారని తెలుస్తోంది.

ప్ర‌థ‌మార్థంలో ముగింపులో ట్విస్టును ప్ర‌జ‌లు తేలిగ్గా మ‌ర్చిపోలేరు. భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ (ఫ‌హ‌ద్ ఫాజిల్)పై ప‌గ‌తో ర‌గిలిపోయేవాడిగా పుష్ప‌రాజ్ పాత్ర‌ను చూపించారు. పెళ్లి మూడ్ వ‌దిలేసి ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే పుష్ప‌రాజ్ ద్వితీయార్థంలో ఫారెస్ట్ అధికారి షెకావ‌త్ తో ఎలా ఢీకొన‌బోతున్నాడో చూడాల‌ని అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. పుష్పలో తన నటనకు బన్నీ జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. సీక్వెల్‌తో పుష్ప‌రాజ్ ఈ స్టోరీని తదుపరి స్థాయికి తీసుకెళ్తాడని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాగే పుష్ప 2 ముగింపులో పుష్ప 3కి లీడ్ ఇచ్చి వ‌దులుతార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. డిసెంబ‌ర్ 6న విడుద‌ల కానున్న ఈ చిత్రం 100కోట్ల ఓపెనింగులు సాధిస్తుంద‌ని బ‌న్ని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. బాలీవుడ్ నుంచి పోటీ ఉంది కాబ‌ట్టి.. పుష్ప‌రాజ్ హ‌వా ఏ రేంజులో సాగ‌నుందో వేచి చూడాలి.

Tags:    

Similar News