3-డీ ఫార్మెట్ లో రామాయణం సెట్లు..అయోథ్య..మిథిలా తలపించేలా!
సహజ నటనలో రణబీర్..సాయిపల్లవి ఒకరికొకరు పోటీ పడి నటింగలరు. వైవిథ్యమైన పాత్రల్లో ఒదిగిపోయే నటులు.
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రామాయణం తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్-సీతగా సాయిపల్లివి నటిస్తోన్న ఈ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. కానీ ఈ రామాయణం కోసం మాత్రం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీత-రాముడి పాత్రలకు ఎంపికైన నటులు పక్కాగా ఆ పాత్రలకు సూటవ్వడంతో? సినిమాకి తొలి పాజిటివ్ సైన్ పడింది.
సహజ నటనలో రణబీర్..సాయిపల్లవి ఒకరికొకరు పోటీ పడి నటింగలరు. వైవిథ్యమైన పాత్రల్లో ఒదిగిపోయే నటులు. దీంతో సీత-రామ పాత్రలకు ఇద్దరు వందశాతం న్యాయం చేస్తారనే అంచనాలు న్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా కోసం 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. రామాయణంలో కీలకమైన అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా అత్యద్బుతంగా ఈసెట్లు నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇవి సాధారణ సెట్లు కాదు. ప్రత్యేకంగా 3డీ పార్మెట్ లో రూపొందించడం విశేషం. విజువల్ గా ఆ సెట్లను హైలైట్ చేయాలన్న సంకల్పంతో దర్శకుడు ఈ రకమైన సెట్లు వేయాల్సిందిగా ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను కోరడంతో ఆయన అభిరుచికి తగ్గట్టు నిర్మిస్తున్నారు. అందుకు గాను కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ సెట్లను ఎక్కడా రాజీ పడకుండా ముంబై శివార్లలో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో రెండవ భాగం షూటింగ్ కూడా చేసుకునేలా పటిష్టగా ఉండేలా సెట్ల నిర్మాణం జరుగుతోందిట.
సెట్ల కోసం వాడే మెటీరియల్ అంతా ఖరీదైనదిగా చెబుతున్నారు. ఇలాంటి సెట్లలో షూటింగ్ చేసిన సన్నివేశాలు 3డీ పార్మెట్ లో థియేటర్లో మరింత అందంగా..అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకు విజువల్ గా గొప్ప అనుభూతి పొందుతారు. ఇందులో రావణుడి పాత్రలో యశ్ నటిస్తుండగా, సన్ని డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమా అన్నిపనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.