ఓవర్సీస్ లో కల్కి 2898ఏడీ సూపర్ రికార్డ్

ఇండియన్ బాక్సాఫీస్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ను ఇంకెవరు ఇప్పట్లో టచ్ చేయలేరని చెప్పొచ్చు.

Update: 2024-06-22 08:35 GMT

ఇండియన్ బాక్సాఫీస్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ను ఇంకెవరు ఇప్పట్లో టచ్ చేయలేరని చెప్పొచ్చు. పాన్ ఇండియా హీరోగా బాలీవుడ్ అగ్రేశ్రేణి స్టార్స్ ని సైతం బీట్ చేసి డార్లింగ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగుతో పాటుగా హిందీలో కూడా సాలిడ్ మార్కెట్ ని ప్రభాస్ క్రియేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని సినిమాల కలెక్షన్స్ కూడా మొదటి రోజే వంద కోట్లని అలాగే రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రభాస్ అత్యధిక వసూళ్లని అందుకుంటున్నారు.


ఓవర్సీస్ లో డార్లింగ్ ప్రభాస్ కి భారీ మార్కెట్ ఉంది. అతని సినిమాలు ప్రీరిలీజ్ సేల్ ద్వారానే భారీ వసూళ్లు సాధిస్తాయి. 2.5 నుంచి 3 కోట్ల ప్రీరిలీజ్ సేల్స్ ప్రభాస్ సినిమాలకి జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా. అందుకు తగ్గట్లుగానే జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ఏఏ క్రియేషన్స్, ప్రత్యంగిర సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి.

ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ 10 రోజుల క్రితమే ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీకి ప్రీ రిలీజ్ సేల్స్ ద్వారా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నార్త్ అమెరికాలో జూన్ 26న కల్కి 2898ఏడీ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ ప్రీమియర్స్ కోసం చాలా రోజుల ముందుగానే టికెట్స్ బుక్ అయిపోయాయి. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కోసం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరిగాయి.

కల్కి మూవీ ఫస్ట్ టైం నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.5 మిలియన్ గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా కేవలం ప్రభాస్ స్టామినా, మూవీ ట్రైలర్ కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటించారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా చేశారు.

అలాగే దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ తో అర్ధమైంది. సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. కల్కి 2898ఏడీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. అందులో కల్కి ఆవిర్భావానికి ముందు జరిగే కథాంశంతో కల్కి 2898ఏడీ ఉండబోతోంది. కల్కి పుట్టిన తర్వాత జరగబోయే కథతో పార్ట్ 2 చిత్రం తెరకెక్కించనున్నారు.

Tags:    

Similar News