మార్కేట్ కు ధీటుగా విశ్వక్ రేటు
విశ్వక్ తో సినిమా అంటే లాస్ అనేది ఉండదని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ కి ప్రస్తుతం మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో ఉన్న యువ హీరోలలో అందరికంటే స్పీడ్ గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న నటుడిగా విశ్వక్ సేన్ ఉన్నాడు. దాస్ కా ధమ్కీ, గామి సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కూడా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ మరీ తీసిపడేసేంత బ్యాడ్ మూవీ అయితే కాదు. ఇక కమర్షియల్ గా పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేసింది.
విశ్వక్ తో సినిమా అంటే లాస్ అనేది ఉండదని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న మెకానిక్ రాకీ సినిమాతో అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటుగా లైలా అనే మూవీ చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని చేయబోతున్నారు.
అంతకంటే ముందుగానే మరికొన్ని సినిమాలని విశ్వక్ సేన్ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాకి విశ్వక్ సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వక్ సేన్ సినిమాలకి మినిమమ్ మార్కెట్ అయితే ఉంది. డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉండటంతో డిస్టిబ్యూటర్స్ అతని సినిమాలని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే డిజిటల్ బిజినెస్ ద్వారా కూడా నిర్మాతలకి మంచి రికవరీ వస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు టాక్ వస్తోంది. ఒక్కో సినిమాకి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడంట. లైలా మూవీకి పాత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. తరువాత అనుదీప్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి 7 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా విశ్వక్ సేన్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారంట. ఇదే నిజం అయితే యంగ్ హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోయే యాక్టర్ గా విశ్వక్ సేన్ మారబోతున్నాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమా ఫుల్ కమర్షియల్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో రాబోతోంది. మెకానిక్ రాకీ, లైలా, అనుదీప్ సినిమాల తర్వాత మరో మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విశ్వక్ సేన్ చేయనున్నాడు.