హీరోల్ని మించి డిమాండ్ చేస్తున్నారా?
స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే పారితోషికం పెరిగిపోతుంది.
స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే పారితోషికం పెరిగిపోతుంది. అందులోనూ ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ అయితే పారి తోషికం ఏ రేంజ్ లో ఉంటుందో కనిపిస్తూనే ఉంది. 100 కోట్లు..200 కోట్లు అంటున్నారు. అదిగాక వచ్చిన లాభాల్లో షేరింగ్ డిమాండ్ చేసే సన్నివేశం కనిపిస్తుంది. కొంత మంది హీరోలు ముందుగా ఎలాంటి ఛార్జ్ వేయకుండా నేరుగా లాభంలో వాటా తీసుకుంటున్నారు.
మరి వాళ్లని డైరెక్టర్ చేస్తోన్న దర్శకుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు? అంటే హీరోల్ని మంచి....వాళ్ల తో సరిసమాన పారితోషికాలు తీసుకుంటున్నారనే విషయం లీకైంది. ప్రముఖంగా సౌత్ నుంచి ఈ ముగ్గురు దర్శకులు పేర్లు చర్చకొస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అట్లీ... టాలీవుడ్ నుంచి రాజమౌళి... సుకుమార్... సందీప్ రెడ్డి వంగలు పారితోషికంలో హీరోల్నే మించిపోతున్నారనే అంశం చర్చకొస్తుంది.
ఇందులో ముందున్నది ఎవరు అంటే దర్శక ధీరుడు రాజమౌళి అంటున్నారు. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే జక్కన్న అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతని బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ లోకి వెళ్లిపోతుంది. అతడి సినిమాలో హీరో ఎవరు? అన్నది తర్వాత సంగతి...అది రాజమౌళి సినిమానా? కాదా? అన్నది ముందుగా మార్కెట్ లో డిస్కషన్ కి వస్తుంది. బాహుబలి...ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారు.
ఓ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి కర్త...కర్మ..క్రియ అన్నీ రాజమౌళినే. ప్రచారం బాధ్యతలు కూడా ఆయనే తీసుకుంటారు. నిర్మాత కేవలం పెట్టుబడి దారుడు మాత్రమే. మిగతా వ్యవహారం మొత్తం నడిపిచేది రాజమౌళినే కావడంతో ఆయన ప్రతీ సినిమాకి లాభాల్లో సగం వాటా తీసుకుంటారని తెలు స్తోంది. ఇదే వేలో యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కనిపిస్తున్నాడు. ఇతర భాగస్వామి బ్యానర్లతో కలిసి సందీప్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడు.
అవసరం మేర తన బ్యానర్ తరుపున కొంత పెట్టుబడి పెడతాడు. `అర్జున్ రెడ్డి` తానొక్కడే నిర్మించిన `యానిమల్` మాత్రం బాలీవుడ్ నిర్మాతతో కలిసి నిర్మించాడు. ఈసినిమాకు గాను భారీగానే లాభాలు పొందాడు. హీరో పారితోషికాన్ని మించి షేర్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదే వేలో సుకుమార్ కూడా కనిపిస్తున్నారు. `పుష్ప` మొదటి భాగం నిర్మాణ బాధ్యతలు మైత్రీకి అప్పగించగా లాభాలన్నీ సంస్థకే వెళ్లాయి.
దీంతో `పుష్ప-2` కోసం సుకుమార్ నిర్మాణంలో భాగస్వామిగానూ మారారు. ముందుగా ఎ లాంటి పారితోషికం తీసుకోకుండా తన నిర్మాణ సంస్థనే పెట్టుబడిగా పెట్టాడు. రిలీజ్ అనంతరం హిట్ అయితే అందులో నేరుగా వాటా తీసుకుంటాడు. అలాగే ఇప్పటివరకూ అట్లీ కూడా పారితోషికం తీసుకునే సినిమాలు చేసాడు. కానీ పాన్ ఇండియా సక్సస్ `పఠాన్` విజయం అనంతరం ఆయన రూట్ మారుస్తున్నాడు. ఇకపై పారితోషికం కాకుండా సినిమాలో వాటా తీసుకునేలా నిర్మాణ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటున్నాడుట.