ఏడాదిలోనే స్టార్ హీరో 1000 కోట్ల సంపాద‌న‌

బాలీవుడ్ లో పాపుల‌ర్ తార‌లు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, హృతిక్, అమితాబ్ షోబిజ్‌లోని అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో త‌మ స్థానాల‌ను నిల‌బెట్టుకున్నారు

Update: 2024-08-30 09:37 GMT

బాలీవుడ్ లో పాపుల‌ర్ తార‌లు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, హృతిక్, అమితాబ్ షోబిజ్‌లోని అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో త‌మ స్థానాల‌ను నిల‌బెట్టుకున్నారు. వారంతా తెలివైన‌ పెట్టుబడుల‌తో భారీగా ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టుకున్నారు. ప్రొడక్షన్ కంపెనీలు, రియ‌ల్ ఎస్టేట్ స‌హా ర‌క‌ర‌కాల‌ సైడ్ వెంచర్‌ల ద్వారా భారీ విజయాన్ని సాధించారు. అయితే వీరంద‌రిలో షారూఖ్ రేసులో అగ్ర‌ప‌థంలో దూసుకుపోతున్నారు.

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితా ప్ర‌కారం.. రూ. 7,300 కోట్ల నికర ఆస్తి విలువతో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని, వినోదం క్రీడలలో తమ వెంచర్‌ల ద్వారా రూ. 4,600 కోట్లు సంపాదించిన జూహీ చావ్లా, ఆమె కుటుంబం తర్వాతి స్థానంలో ఉన్నారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఆస‌క్తిక‌రంగా షారూక్ ఖాన్ ఆస్తులు గ‌త ఏడాది 6300 కోట్లు ఉండ‌గా, ఈ ఏడాది ఈ నిక‌ర ఆస్తి విలువ ఏకంగా 1000 కోట్లు పెరిగి టోట‌ల్ గా 7,300 కోట్ల మార్క్ కి చేరుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పారితోషికాలు, సినిమాల‌ నిర్మాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో షారూఖ్‌ విజయవంతమైన ప్ర‌యాణం సాగించారు. షారుఖ్ ఖాన్ సంపద పెరుగుతూనే ఉంది. అతడు న‌టించిన వ‌రుస చిత్రాలు విజ‌యాలు సాధించాయి. ప‌ఠాన్, జ‌వాన్ - డంకీ ఫ‌లితాలు ఖాన్ లో ఉత్సాహం పెంచాయి. నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ సైతం పురోభివృద్ధిని సాధించింది. షారూక్ ఖాన్ ప్రభావం ఇత‌ర‌ వాణిజ్య‌ పరిశ్రమల‌కు కూడా విస్తరించింది. అతడు అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్. అనేక ఉత్పత్తులకు ప్ర‌మోట‌ర్ గా సేవలను ఆమోదించాడు. అతడి అపారమైన పాపులారిటీ -సోషల్ మీడియా ఫాలోయింగ్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్న బ్రాండ్‌లకు లాభదాయకమైన ప్రతిపాదనగా మారాయి.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2024 బాలీవుడ్ స్టార్‌లను ముఖ్యమైన సంపద సృష్టికర్తలుగా హైలైట్ చేసింది. 2000 కోట్ల నికర ఆస్తులతో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సినిమాల్లో నటించడమే కాకుండా హృతిక్ ఫిట్‌నెస్ బ్రాండ్ HRXని కూడా కలిగి ఉన్నాడు. వ‌స్త్ర వ్యాపారంలోను స‌క్సెస్ సాధించాడు. అమితాబ్ బచ్చన్ స‌హా అత‌డి కుటుంబం రూ.1,600 కోట్ల ఆస్తుల‌తో నాలుగో స్థానంలో ఉండ‌గా, నిర్మాత కరణ్ జోహార్ నికర ఆస్తుల‌ విలువ రూ.1,400 కోట్లు అని తెలుస్తోంది.

Tags:    

Similar News