మాస్ట్రో బయోపిక్.. ఏం జరుగుతుంది..?

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ ని తెరకెక్కించేలా ప్లాన్ చేశారని తెలిసిందే. కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా ఫిక్స్ చేశారు

Update: 2024-10-28 12:52 GMT

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ ని తెరకెక్కించేలా ప్లాన్ చేశారని తెలిసిందే. కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా ఫిక్స్ చేశారు. వెండితెర ఇళయరాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ వారు ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు ఏమైందో ఏంటో కానీ ఈ బయోపిక్ ముందుకు జరగట్లేదు అన్నది లేటెస్ట్ టాక్. ఓ పక్క ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా తిరిగి ఫాంలోకి వచ్చిన ధనుష్ కొత్తగా ఇడ్లీ కొట్టు అనే సినిమా మొదలు పెట్టాడు.

ఇళయరాజా బయోపిక్ కు ధనుష్ సరైన టైం ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా చిత్ర యూనిట్ కి ఏవో ఇబ్బందులు ఉన్నట్టుగా కోలీవుడ్ మీడియా చెప్పుకుంటుంది. అందుకే ఇళయరాజా బయోపిక్ ముందుకు కదలట్లేదని.. సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది అన్నట్టుగా చెబుతున్నారు. ఐతే నిర్మాతలను మార్చి సినిమాను కొనసాగించేలా ప్లాన్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట.

ఆల్రెడీ సినిమా కోసం కొంత వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు కాబట్టి వేరే ప్రొడక్షన్ లో ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ధనుష్ తో పాటు కమల్ హాసన్ కూడా ఈ సినిమా ఓపెనింగ్ రోజు సందడి చేశారు. ఇంతకీ ఇళయరాజా బయోపిక్ నిర్మాత మారుతున్నాడా.. బయోపిక్ షూటింగ్ ఎప్పుడు ఊపందుకుంటుంది. సినిమా విషయంలో ధనుష్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడు లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.

ధనుష్ ఐతే సినిమా షూటింగ్ అంతా రెడీ అయితే సెట్ కి వచ్చేందుకు సిద్ధం అంటున్నాడు. వేరే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కమిటైన ఇళయరాజా బయోపిక్ కు కావాల్సినంత టైం ఇస్తానని చెబుతున్నాడట. ఏది ఏమైనా మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేంత వరకు సినిమా గురించి డౌట్ పడే ఛాన్స్ ఉంటుంది.

ఓ పక్క ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. కుబేర షూటింగ్ చివరి దశకు రాగా ఆ సినిమాపై ధనుష్ అండ్ టీం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు రాయన్ తో తన డైరెక్షన్ లో సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఇడ్లీ కొట్టుని కూడా హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు ధనుష్. ఈ సినిమా గురించి పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News