అలా అంటే స్టుపిడ్ లా తిట్టేసింది!
పెళ్లి కాకుండానే బిడ్డను కనడం..అటుపై వివాహం చేసుకోవడంతో అన్ని ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి.
మూడేళ్ల గ్యాప్ అనంతరం ఇలియానా మళ్లీ మ్యాకప్ వేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో 'తేరీ క్యా హోగా లవ్లీ`..'దో ఔర్ దో ప్యార్ `సినిమాలు చేస్తోంది. మరి ఈ గ్యాప్ లో ఇలియానా ఎన్నిరకాల విమర్శలు ఎదుర్కుందో తెలిసిందే. చేతిలో సినిమాలు లేక..వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలతో ఇబ్బంది పడింది.పెళ్లి కాకుండానే బిడ్డను కనడం..అటుపై వివాహం చేసుకోవడంతో అన్ని ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. తాజాగా 'దో ఔర్ దో ప్యార్' సినిమా రిలీజ్ సందర్భంగా ప్రచారంలో పాల్గొంటుంది.
చాలా కాలం తర్వాత మీడియాలో అధికారికంగా కనిపించిన సందర్భంలో కొన్ని విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే.. `సినిమాలో పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేయలేదు. శారీరకంగా ఎలాంటి పనులు చేయలేదు. ఆ సమయంలో పాత్ర కోసం నన్ను మార్చుకునే ఓపిక..శక్తి..ఆసక్తిర ఏవీ లేవు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. నేనిప్పుడు ఫిట్ గా లేను. సినిమా చేయగలనో..లేదో కూడా సందేహమే. బరువు తగ్గడం నావల్ల కాదని దర్శకురాలు శిరీషతో చెప్పేసాను.
అప్పుడామె స్టుపిడ్ లా మాట్లాడకు. నువ్వు ఎలా ఉంటే అలాగే కంటున్యూ అవ్వు. పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు అవసరం లేదని చెప్పింది. అలా చెప్పింది కాబట్టే సినిమా చేసాను లేదంటే చేసేదాన్ని కాదు` అని తెలిపింది. ఈ సినిమా రిలీజ్ తో బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి అమ్మడు మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. `అమర్ అక్బర్ ఆంటోనీ`తో కంబ్యాక్ అవ్వాలని చూసింది.
కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ఆ తర్వాతే ఇలియానా వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ కారణంగా తానెంత ఇబ్బంది పడిందో? ఆమె మాటల్లోనే తెలుస్తుంది. చివరికి అవకాశాలొచ్చినా కూడా నటించలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.