ఇండియాలో మోస్ట్ వాంటెండ్ టాప్-5 మేక‌ర్స్!

కానీ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌ర‌శ్ర‌మ‌లో ఈ ఐదుగురు మాత్రం అందుకు మిన‌హాయింపు.

Update: 2024-10-14 16:30 GMT

స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌ని డైరెక్ట‌ర్లు అంతా క్యూలో ఉంటారు. వాళ్ల‌తో అవ‌కాశం ఎప్పుడొస్తుందా? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలో హీరో కోసం వాళ్ల‌లో వాళ్లకే తీవ్ర‌మైన పోటీ సైతం ఏర్ప‌డుతుంది. అంతిమంగా వాళ్ల‌లో ఎవ‌రు ది బెస్ట్ అనుకుంటే? వాళ్ల‌కు పిలిచి అవ‌కాశం ఇవ్వ‌డం అన్న‌ది హీరోల విధానం. కానీ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌ర‌శ్ర‌మ‌లో ఈ ఐదుగురు మాత్రం అందుకు మిన‌హాయింపు.

హీరోల కోసం వాళ్లు వెయిట్ చేయ‌డం కాదు. ఆడైరెక్ట‌ర్ కోస‌మే హీరోలు వెయిట్ చేస్తున్నారు? అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్లి లేదు. వాళ్లు పిల‌వాలే గానీ ఉన్న ప‌ళంగా చేస్తోన్న సినిమాలు సైతం వ‌దిలే వీళ్ల‌కు డేట్లు ఇవ్వాల‌ని స్టార్లు అంతా ఎదురు చూస్తున్నారు. పిలుపు వ‌స్తే చాలు..ఏదో ఒక‌రోజు చేస్తాం అన్న ధీమా అయినా క‌లుగుతుంద‌ని ఆ పిలుపు కోస‌మే ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.

మ‌రి ఆ టాప్ -5 డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే? రాజ‌మౌళి, లోకేష్ క‌న‌గ‌రాజ్, సందీప్ రెడ్డి వంగ‌, ప్ర‌శాంత్ నీల్, అట్లీ. ఈ ఐదుగురి ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్ల చేసిన చిత్రాలు..వాటి రిజ‌ల్ట్ చూస్తేనే వాళ్లెంతటి ప్ర‌తిభావంతుల‌న్న‌ది తెలుస్తుంది. క్రియేటివ్ రంగంలో వీళ్ల‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్న మేక‌ర్స్. బాహుబ‌లి , ఆర్ ఆర్ ఆర్ తో రాజ‌మౌళి, అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ తో సందీప్ రెడ్డి, ఖైదీ, లియో తో లోకేష్ క‌న‌గ‌రాజ్, కేజీఎఫ్, స‌లార్ తో ప్ర‌శాంత్ నీల్, జ‌వాన్ తో అట్లీలో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే మెస్ట్ వాటెండ్ మేక‌ర్ల‌గా మారిపోయారు.

ఈ ఐదురుగు ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి ఇండియ‌న్ టాప్ స్టార్స్ తో అంతా పోటీ ప‌డుతున్నారు. బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల నుంచి ఏకంగా 1000 కోట్లు వ‌సూళ్లు తెచ్చే స్టామినా ఉన్న హీరోలంతా? ఎదురు చూస్తున్నారు. వాళ్లు పిల‌వాలే గానీ ప‌రిగెత్తి కొచ్చేయాల‌ని చూస్తున్నారు. ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌మిళ ద‌ర్శ‌కుడు వెట్రీమార‌న్ కూడా త‌న అభిమాన ద‌ర్శ‌కుడిగా చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News