పారితోషికంలో టాప్ -10 హీరోయిన్స్
భారతదేశంలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోలు ఉన్నారు. అయితే హీరోలతో పోలిస్తే హీరోయిన్‌ల పారితోషికాల రేంజ్ చాలా తక్కువ.
భారతదేశంలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోలు ఉన్నారు. అయితే హీరోలతో పోలిస్తే హీరోయిన్‌ల పారితోషికాల రేంజ్ చాలా తక్కువ. అతికొద్దిమంది హీరోయిన్లు మాత్రమే 10 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకుంటున్నారు. దీనివల్ల పారితోషికాల్లో మేల్ డామినేషన్ పై చాలా చర్చ సాగుతోంది.
అయితే ఇటీవలి కాలంలో హాలీవుడ్ కి ధీటుగా యాక్షన్ పాత్రల్లో కథానాయికలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోలతో పోటీపడుతూ నాయికలు రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, సమంత, నయనతార, ఆలియా భట్ సహా పలువురు కథానాయికలు రిస్కీ యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు. దీంతో వీరంతా భారీ పారితోషికాల్లో ట్రెండ్ ని మార్చే దిశగా సాగుతున్నారు. 15 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకునే కథానాయికల జాబితాలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, ఆలియా భట్ ఉన్నారు. ఈ ముగ్గురూ భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారు నాయికా ప్రధాన పాత్రలతో తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నారు. నయనతార, సమంత, శ్రద్ధా కపూర్, కియరా, పూజా హెగ్డే లాంటి కథానాయికలు తమ రేంజును పెంచుకునేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా 10 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకునే రేంజుకు ఎదుగుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల జాబితా:
ప్రియాంక చోప్రా 15 - 30 కోట్లు
దీపికా పదుకొనే 15 - 30 కోట్లు
ఆలియా భట్ 15- 25 కోట్లు
కత్రినా కైఫ్ 12 -15 కోట్లు
కరీనా కపూర్ 12 కోట్లు
కంగనా రనౌత్ 10 కోట్లు
శ్రద్ధా కపూర్ 07 కోట్లు
అనుష్క శర్మ 08 కోట్లు
ఐశ్వర్య రాయ్ 5 - 6 కోట్లు
విద్యాబాలన్ 4 కోట్లు
కియారా అద్వానీ 3 -5 కోట్లు
దిశా పటానీ 6 -10 కోట్లు
నయనతార 6- 10కోట్లు
సమంత- 4 కోట్లు
పూజా హెగ్డే- 4 కోట్లు
కాజోల్ 3 - 4 కోట్లు
కృతి సనన్ 4 - 8 కోట్లు
మాధురీ దీక్షిత్ 3 - 5 కోట్లు