ఇండియన్ 2: అక్కడ బిజినెస్ ఎలా ఉందంటే..
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని శంకర్ తెరకెక్కించారు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీ రిలీజ్ అయిన 28 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని శంకర్ తెరకెక్కించారు.
చాలా అవాంతరాల తర్వాత ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని జులై 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ నుంచి రాబోయే మూవీ ఇదే కావడంతో హైప్ నెలకొంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యాయి. తెలుగులో కూడా ఇండియన్ 2కి మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో థీయాట్రికల్ బిజినెస్ జరగలేదు. ఇండియన్ మూవీ హిందీలో 12 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఆ నెంబర్ చాలా పెద్దది. ఇక సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ గా వచ్చే మూవీస్ కి హిందీలో భారీగానే బిజినెస్ జరుగుతుంది.
కానీ ఇండియన్ 2 విషయంలో అది జరగలేదు. దీనికి కారణం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సీక్వెల్ రావడమే అని తెలుస్తోంది. సినిమా హిందీ రైట్స్ 15 కోట్లకి అమ్ముడైనట్లు సమాచారం. కమల్ హాసన్ ఇమేజ్ పరంగా చూసుకున్న ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పాలి. హిందీలో ఇండియన్ 2 సినిమాపై పెద్దగా హైప్ లేకపోవడం వలన థీయాట్రికల్ బిజినెస్ తక్కువ జరిగినట్లు ట్రేడ్ పండితుల మాట.
ఈ లెక్కన చూసుకుంటే 30 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియన్ 2 హిందీలో కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. జులై 12న బాలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడం వలన ఇండియన్ 2కి కలిసొస్తుందని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. ఇండియన్ 2లో సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటించారు.