ఇండియన్ 2.. గ్రాండియర్ ఓకే కాని..?
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పాతికేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు కాదు ఆ టైం లోనే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఐతే పాతికేళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాడు శంకర్. కమల్ హాసన్ తోనే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. విక్రం తో తిరిగి కెరీర్ లో సూపర్ ఫాం లోకి వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2 తో మరోసారి బాక్సాఫీస్ పై తన ప్రభావం చూపించాలని చూస్తున్నారు.
జూలై 17న రిలీజ్ అవుతున్న ఇండియన్ 2 సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ లో శంకర్ మార్క్ గ్రాండియర్ స్టోరీ టెల్లింగ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఈసారి రెండు సినిమాలతో శంకర్ ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. కానీ ఇండియన్ 2 లో కమల్ హాసన్ లుక్స్ ఆడియన్స్ ని కాస్త కంగారు పెట్టిస్తున్నాయి. ట్రైలర్ లో కమల్ హాసన్ ఓల్డ్ లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
పాతికేళ్ల క్రితం మిడిల్ ఏజ్ లో ఉన్న కమల్ ని ఓల్డ్ గెటప్ లో చూసి వారెవా అనుకున్న ఆడియన్స్ ఇప్పుడు తన ఏజ్ కి తగిన పాత్ర చేసినా సేనాపతి లుక్ ఎక్కడో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. ఎంత ప్రోస్తటిక్ మేకప్ వేసినా కమల్ ముఖం లో ఏదో తక్కువ అయ్యిందని అనుకుంటున్నారు. అంతేకాదు ఇదివరకు మేకప్ వేసుకున్నా చాలా నాచురల్ గా ఉండేది కానీ ఇండియన్ 2 లో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
మరి సినిమాలో ఈ విషయంపై అంతగా ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్త పడ్డారో లేదో కానీ ఇండియన్ 2 ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు విజువల్స్ కేక అని అంటూనే కమల్ హాసన్ లుక్ చూసి షాక్ అవుతున్నారు. ఐతే లుక్ ఎలా ఉన్నా కమల్ తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారని తెలిసిందే. మరి ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ కూడా నటించారు. కమల్ హాసన్ తో పాటుగా వీరు కూడా సినిమాలో తమ పర్ఫార్మెన్స్ తో అలరిస్తారని చెబుతున్నారు.