ఎనిమిదేళ్ల తర్వాత వచ్చి ఉసూరుమనిపించారు

కానీ జవాన్ ప్రభావం కానీ, తనీ ఒరువన్‌ ఎఫెక్ట్‌ కానీ 'ఇరవైన్‌' పై కనిపించలేదు. నయన్‌ ఉన్నా కూడా ఇరవైన్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

Update: 2023-10-02 04:01 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఎనిమిది సంవత్సరాల క్రితం సూపర్‌ హిట్ మూవీ తనీ ఒరువన్‌ లో నటించింది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనీ ఒరువన్ ని తెలుగు లో రామ్ చరణ్ ధృవ గా రీమేక్ చేసి మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

తనీ ఒరువన్ లో నటించిన జయం రవి మరియు నయనతార జంటగా మరో సినిమా రావడానికి ఏకంగా ఎనిమిది ఏళ్లు పట్టింది. హిట్ కాంబో లో రూపొందిన 'ఇరవైన్‌' పై తమిళ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇది మరో తనీ ఒరువన్‌ అన్న రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూశారు. యూనిట్‌ సభ్యులు కూడా ఇది మరో బ్లాక్ బస్టర్ మూవీ అన్నట్లుగా ప్రచారం చేశారు.

ఇరవైన్ మూవీకి కొన్ని రోజుల ముందే హిందీలో నయన్‌ నటించిన జవాన్‌ విడుదల అవ్వడం.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడం వంటి పరిణామాలు కలిసి వస్తాయని అంతా భావించారు. కానీ జవాన్ ప్రభావం కానీ, తనీ ఒరువన్‌ ఎఫెక్ట్‌ కానీ 'ఇరవైన్‌' పై కనిపించలేదు. నయన్‌ ఉన్నా కూడా ఇరవైన్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

నెగటివ్ రివ్యూలతో సినిమా కి మొదటి రోజే దారుణమైన కలెక్షన్స్ నమోదు అయ్యాయి. జయం రవి గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా కచ్చితంగా డీసెంట్‌ ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుందని కోలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల వారు అనుకున్నారు. కానీ మొత్తం ఫలితం తారు మారు అయింది.

జయం రవి, నయనతార ల హిట్ జోడీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన నేపథ్యం లో అంతా కూడా చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సక్సెస్ జోడీ ఇరవైన్‌ తో ఉసూరుమనిపించారు. ఇంకా చాలా ఊహించాం.. ఇలా ఉందేంటి అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నయన్‌ ఇలాంటి సినిమాకు ఎలా ఓకే చెప్పారు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News