భ‌ర్త‌ను అప్పుడే కొంగున క‌ట్టేసుకున్న స్టార్ డాట‌ర్

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-05 06:24 GMT

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. బుధవారం రాత్రి ముంబైలో సన్నిహిత వేడుకలో బంధుమిత్రులు, కుటుంబ స‌మ‌క్షంలో వివాహం చేసుకుంది. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది నూపూర్ వివాహ వస్త్రధారణ.. బరాత్. ఈ జంట తమ వివాహ ధృవీకరణ పత్రంపై సంతకం చేస్తున్నప్పుడు వరుడు వేదికపైకి జాగింగ్ చేస్తూ షార్ట్ - నల్ల చొక్కా ధరించి కనిపించాడు. ఈ దుస్తులపై సోషల్ మీడియాల్లో బోలెడంత చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇరా ఇప్పుడు అన్ని ట్రోలింగ్ ల‌కు స‌మాధాన‌మిచ్చింది.

తాజాగా వేడుక నుండి నూపూర్‌తో తన అందమైన ఫోటోను ఇరా త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది. తన స్నేహితులతో కలిసి నూపూర్ జాగింగ్ చేస్తున్న ఫోటోను కూడా జ‌త చేసింది. ''అతడు గుర్రం మీద రాలేదు. వేదిక వద్దకు పరుగెత్తుకుంటూ వ‌చ్చాడు. నేను దారి పొడ‌వునా అంద‌మైన పోస్ట‌ర్లు (త‌న కెమెరాలో తీసిన ఫోటోలు) సోష‌ల్ మీడియాలో ఉంచాను'' అని రాసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో ఇరా తన వివాహ వేడుకలో నుపుర్ వేషధారణ గురించి, గుమిగూడిన అతిథుల గురించి మాట్లాడింది. నూపుర్ స్నానం చేసి వివాహ‌ వేడుకలో దుస్తులు ధరించవలసి వచ్చినందున అత‌డిని క్షమించమని ఇరా కోరింది. స్నానం చేసాక షేర్వాణీ ధరించిన నూపుర్.. ఇరా- ఖాన్ కుటుంబంతో పోజులిచ్చాడు. అమీర్ స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో ఇరా-నుపుర్ జంట ఫోటోలు దిగాడు. వివాహ వేదిక వెలుపల గుమికూడిన మీడియాకు ఫోజులిచ్చారు. త‌న భ‌ర్త గురించి ఎవ‌రేమ‌న్నా దానిని ఇరా స‌హించ‌డం లేదు. ట్రోలింగ్ కి వెంట‌నే చెక్ పెట్టేస్తోంది. దీంతో అప్పుడే త‌న భ‌ర్త‌ను కొంగున క‌ట్టేసుకుంది అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అయితే నుపూర్ చెమ‌ట‌ల‌తో ఎందుకు త‌డిసిపోవాల్సి వ‌చ్చింది? అంటే...అత‌డు బరాత్ లో పాల్గొన్నాడు. దానిని వ‌దిలేసి త‌న‌ ఇంటి నుండి వివాహ వేదిక వరకు జాగింగ్ చేస్తూ వ‌చ్చేసాడు. ఇది 8 కిలోమీటర్ల జాగ్. నూపూర్ తన కుటుంబంతో కలిసి బారాత్‌లో డ్యాన్స్ చేశాడు... అందుకే అత‌డికి చెమ‌ట‌లు ప‌ట్టాయి. దాంతో వెన్యూ వ‌ద్ద‌నే అత‌డు స్నానం చేసి దుస్తులు ధ‌రించాడు. కానీ ఇంత‌లోనే అత‌డి దిగంబ‌ర అవ‌తారానికి సంబంధించి మీడియా ఫోటోలు లీక్ చేసింది. దీంతో ట్రోలర్స్ విరుచుకుప‌డ్డారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఇరా-నుపూర్ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు నెలల తర్వాత, వారు ఇమ్రాన్ ఖాన్, అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా , కిరణ్ రావు, ప్ర‌స్తుత స‌హ‌చ‌రి ఫాతిమా సనా షేక్‌ సహా ఇత‌ర కుటుంబ సభ్యులు..సన్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ పార్టీని నిర్వహించారు. అమీర్ కుటుంబం రెండు భారీ వేడుకలను ప్లాన్ చేసార‌ని తెలిసింది. ఒకటి ఉదయపూర్‌లో.. మరొకటి ఢిల్లీలో ఈ పార్టీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుకల‌కు ప్రముఖ తారలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News