శ్రీలీల vs పూజ.. సీన్ రివర్స్?

కానీ ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకోగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించారు.

Update: 2024-10-27 09:39 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను సాధించింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా తొలుత పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకోగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీలీల నటిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. ఇప్పుడు ఆమె ప్లేస్ లో పూజ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ అప్ కమింగ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారని చాలా నెలలుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. వారిద్దరి కాంబోలో వరుణ్ ధావన్ తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ ఓ కామెడీ మూవీని తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో శ్రీలీల.. ఆ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుందని అంతా అనుకున్నారు. కొద్ది రోజుల క్రితం, ఆ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ హీరోయిన్ గా ఫిక్స్ చేయలేదని చెప్పారు. కానీ శ్రీలీలనే హీరోయిన్ గా నటిస్తారని టాక్ వినిపిస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీలీల ప్లేస్ లో పూజా హెగ్డేను మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. తొలిసారి వరుణ్, పూజ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని సమాచారం. రీసెంట్ గా ఓ వేడుకలో తాను పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నానని, ఆయా మేకర్స్ అనౌన్స్మెంట్స్ ఇస్తారని పూజా తెలిపారు. ఇప్పుడు అందులో ఒకటి వరుణ్ ధావన్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. సీతారామం మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులకు బాగా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా మరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.

అలా శ్రీలీల ప్లేస్ లో పూజా హెగ్డేను తీసుకున్నారని వార్తలు వస్తుండగా.. గుంటూరు కారం మూవీ టైమ్ లో జరిగిన సీన్.. ఇప్పుడు రివర్స్ లో రిపీట్ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే డేవిడ్ ధావన్.. తన సినిమాల్లో హీరోయిన్స్ ను గ్లామరస్ గా చూపిస్తారు. ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పిస్తారు. ఇప్పుడు పూజ, మృణాల్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అంటున్నారు. హై జవానీతో ఇష్క్ హోనాహై అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Tags:    

Similar News