మాళవిక ప్లేస్ కొట్టేసిన శృతి హాసన్..?
ప్రభాస్ రాజా సాబ్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న అమ్మడు ఆ సినిమాతో తన రేంజ్ పెరుగుతుందనే ఆలోచనలో ఉంది.
మలయాళ భామ మాళవిక మోహనన్ త్వరలో రాజా సాబ్ తో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఐతే డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు కానీ మాస్టర్ తో అమ్మడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమిళ్ లో ఇప్పటికే ఆడియన్స్ ని అలరిస్తున్న మాళవిక తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలని చూస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న అమ్మడు ఆ సినిమాతో తన రేంజ్ పెరుగుతుందనే ఆలోచనలో ఉంది.
ఇదిలాఉంటే లోకేష్ కనకరాజ్ తో మాస్టర్ సినిమా చేసిన మాళవిక ఆ టైం లోనే కూలీ సినిమా గురించి డిస్కషన్ వచ్చిందట. రజనీ కూతురిగా ముందు తననే అనుకున్నారని కాకపోతే ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని అంటుంది మాళవిక. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీతో కూలీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటుస్తుంది.
రజిని కూతురిగా ఈ సినిమాలో శృతి హాసన్ కనిపిస్తుందని తెలుస్తుంది. ఐతే లోకేష్ ఈ పాత్ర కోసం ముందు మాళవికని అనుకున్నారని తెలుస్తుంది. ఐతే మరి ఆమెను ఎందుకు వద్దనుకున్నారో ఏమో కానీ మాళవిక ప్లేస్ లో శృతి హాసన్ వచ్చి చేరింది. ఐతే శృతి హాసన్ ఈమధ్యనే లోకేష్ కనకరాజ్ తో ఒక వీడియో సాంగ్ చేసింది. ఆ కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల ఈ ఛాన్స్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు.
ఈమధ్య శృతి హాసన్ తన దాకా వచ్చిన ఛాన్స్ లను వదిలేస్తుంది. అడివి శేష్ తో డెకాయిట్ సినిమా ముందు శృతి హాసన్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేయగా మధ్యలో ఏమైందో ఏమో కానీ ఆమె ప్లేస్ లో మృణల్ ఠాకూర్ ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో సలార్ 1 సినిమా చేసిన అమ్మడు నెక్స్ట్ తెలుగు సినిమా ఏది ఓకే చేయలేదు. తమిళ్ లో కూడా శృతి హాసన్ కేవలం కూలీ ఒక్కటే చేస్తుంది. అక్కడ మాళవిక ప్లేస్ లో శృతి హాసన్ వస్తే.. ఇక్కడ శృతి ప్లేస్ లో మృణాల్ వచ్చింది. మరి శృతి కెరీర్ మీద అంత ఫోకస్ గా లేదన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది. అంతకుముందు ఏమో కానీ ఇప్పుడు కొత్త హీరోయిన్స్ చాలామంది ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి ఆమెను లైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.