రజినీకాంత్.. తెలుగు స్టోరీని రిజెక్ట్ చేశాడా?

అయితే రజినీకాంత్ తో మూవీస్ చేయడానికి కోలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు.

Update: 2024-08-10 22:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వేట్టయాన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రెడీ అవుతున్నాయి. వీటి తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా ఒప్పుకోలేదు. అయితే రజినీకాంత్ తో మూవీస్ చేయడానికి కోలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు.

నెల్సన్ దిలీప్ తో కూడా రజినీకాంత్ తో ఇంకో సినిమా చేసే అవకాశం ఉందంట. రజినీకాంత్ స్ట్రైట్ తెలుగు సినిమాలు కెరియర్ ఆరంభంలో కొన్ని చేశారు. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అంటే మోహన్ బాబు పెదరాయుడు మూవీలో నటించారు. తరువాత కథానాయకుడు సినిమా చేశారు. ఈ సినిమా నిజానికి బైలింగ్వల్ గా తెలుగు, తమిళ్ యాక్టర్స్ తో తెరకెక్కించారు. తెలుగు భాష కోసం టాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నారు.

అలా తెలుగులో రజినీకాంత్ తో పాటు జగపతిబాబు ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందంట. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా సక్సెస్ తో ఊపు మీద ఉన్న డైరెక్టర్ మహేష్ బాబు రామ్ పోతినేని మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని సంప్రదించారంట. ఈ మూవీ కథ ప్రకారం ఒక స్టార్ హీరో అభిమానిగా రామ్ కనిపిస్తాడంట. తన అభిమాన నటుడిని చూడటానికి వచ్చిన యువకుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది కథలో భాగంగా ఉంటుందని టాక్. అయితే డేట్స్ కుదరక రజినీకాంత్ రామ్ పోతినేని మూవీని రిజక్ట్ చేసారంట.

దీంతో డైరెక్టర్ మహేష్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారంట. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ కి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News