స‌మంత ప్లాన్ అదేనా

మ‌రి సమంత నిర్మాణ సంస్థ ఏ భాష‌లో ముందుగా అందుబాటులోకి రానుంది అంటే? త‌మిళ‌....తెలుగులో అనే వార్త తెర‌పైకి వ‌చ్చింది.

Update: 2023-12-13 23:30 GMT

స‌మంత నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. సొంత‌గా ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించి నిర్మాత‌గానూ అదృష్టాని ప‌రీక్షించుకుంటుంది. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న స‌మంత ఇండియాకి తిరిగి రాగానే ప్రొడ‌క్ష‌న్ హౌస్ కి సంబంధించిన ప‌నుల్లోనే నిమ‌గ్నం కానుంది. మ‌రి సమంత నిర్మాణ సంస్థ ఏ భాష‌లో ముందుగా అందుబాటులోకి రానుంది అంటే? త‌మిళ‌....తెలుగులో అనే వార్త తెర‌పైకి వ‌చ్చింది.

ఈ రెండు భాష‌ల్లో త‌న‌కున్న ప‌రిచ‌యాల్ని వినియోగించుకుని నిర్మాణ సంస్థ‌ని ముందుకు తీసుకెళ్లాల‌ని భావిస్తోందిట‌. ఇది నిజ‌మ‌వ్వ‌డానికి ఛాన్సెస్ ఎంత‌వ‌ర‌కూ ఉన్నాయంటే? చాలా కార‌ణాల‌నే క‌నిపిస్తు న్నాయి. స‌మంత ఇప్ప‌టికే తెలుగులో అగ్ర హీరోయిన్ గా వెలిగింది. లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గా స‌త్తా చాట‌లేదు గానీ..క‌మ‌ర్శియ‌ల్ హీరోయిన్ గాత‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానులున్నారు.

ఎంతో మంది నిర్మాత‌లు..ద‌ర్శ‌కులు..హీరోల‌తో మంచి స్నేహం ఉంది. ఇక మాతృ భాష త‌మిళ్ స‌మంత‌కు ఎలాగూ కొత్త కాదు. అక్క‌డ చేసింది కొన్ని సినిమాలే అయినా సొంత ఇండ‌స్ట్రీలో ఎన్నో ప‌రిచ‌యాలు న్నాయి. అందుకే స‌మంత ముందుగా ఆ రెండు భాష‌ల్ని టార్గెట్ చేస్తుంద‌ని గెస్సింగ్ తెర‌పైకి వ‌స్తున్నాయి. హిందీలో ఇప్పుడే కెరీర్ ప్రారంభించింది. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం వెబ్ సిరీస్ తోనే ప‌రిచ‌య‌మైంది.

సినిమాలంటూ చేయ‌లేదు. అమెరికా నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ల్లో పాల్గొంటుంది. ఈ లోపు సీటాడెల్ ప్ర‌మోష‌న్ ప‌నులు కూడా మొద‌ల‌వుతాయి. ఇప్ప‌టికే ఆ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసిన సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఉండి న‌టిగా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే హైద‌రాబాద్ లో నిర్మాత‌గా చ‌క్రం తిప్పే ప్లాన్ లో ఉంది. బాలీవుడ్ కి వెళ్లిన కొత్త‌లోనే అమ్మ‌డు సినిమాలు చేక‌పోయినా క‌ర‌ణ్ టాక్ షో స‌హా వివిధ టెలివిజ‌న్ ఛానెల్స్ ని చుట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా తిరిగేయ‌డం వెనుక ప‌రిచ‌యాలు పెంచుకునే ఓ ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News