కల్కి 2898 AD స్టోరి ఇదేనా.. బిగ్ ట్విస్ట్ కూడా..?
పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కల్కి 2898ఏడీ సినిమా ప్రమోషన్స్ ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ నేచురల్, ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రెండు భాగాలుగా నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు. ఏకంగా 22 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కల్కి 2898ఏడీ సినిమా ప్రమోషన్స్ ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారు. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మూవీ గురించి ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి మూవీ కథ మహాభారతం కాలంలో మొదలయ్యి 2898 ఏడీలో ముగుస్తుందని చెప్పారు.
అందుకే సినిమాకి ఆ టైటిల్ పెట్టామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కల్కి మూవీకి సంబందించిన ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. దుష్టలక్షణాలు ఉన్న కలి కమల్ హాసన్ ఈ ప్రపంచాన్ని తన అధీనంలోకి తీసుకొని ప్రజలని హింసిస్తూ అంధకారంలో బందీలుగా చేస్తాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా కల్కిగా ప్రభాస్ అవతరిస్తాడు.
అతను అశ్వథామ (అమితాబచ్చన్) ని కలిసి అతనికి శాప విమోచనం కలిగిస్తాడు. ఈ ప్రపంచానికి కాపాడటం కోసం సాయం కోరుతాడు. ఆ తరువాత ఈ విశ్వంలో ఉన్న ఆరుగురు చిరంజీవులతో కలిసి కలితో పోరాటం చేస్తాడు. మరొక ట్విస్ట్ ఏమిటంటే.. కలి కొడుకుగా నెగిటివ్ షేడ్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. పార్ట్ 1 క్లైమాక్స్ లో నిజమైన కలిపురుషుడు విలన్ ప్రభాస్ అని రివీల్ అవుతుంది.
పార్ట్ 2లో కల్కి అవతారంలో ప్రభాస్ కలిపురుషుడు అయిన ప్రభాస్, అతని తమ్ముడు విలన్ ని ఎదుర్కొంటాడు. ఫైనల్ గా ఈ విశ్వాన్ని వారి నుంచి కాపాడి ధర్మస్థాపన చేయడంతో కథ ముగుస్తుందంట. ఇదే కల్కి 2898ఏడీ కథ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియదు. కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ అయిన కథ మొత్తం వాస్తవం కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది.