ఫోటో స్టోరి: బాల్కనీలో అందాల ఐశ్వర్య భంగిమలు
ఐశ్వర్య వైట్ టాప్ రోజ్ కలర్ బాటమ్ లో అద్భుతమైన భంగిమలతో హొయలు పోయింది. నిజానికి ఈ అందమైన ఫిజిక్ కోసం నిరంతరం జిమ్ యోగా అంటూ చాలా శ్రమిస్తోంది ఈ భామ.
దశాబ్ధం క్రితం లవర్ బోయ్ సిద్ధార్థ్ సరసన లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో నటించింది ఐశ్వర్య మీనన్. ఆరంగేట్రం ఈ బ్యూటీకి ఆశించిన విజయం దక్కలేదు. కానీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కన్నడం, తమిళంలోను కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల నిఖిల్ సరసన 'స్పై' మూవీలో నటిగా మంచి మార్కులే దక్కించుకుంది.
ఐశ్వర్య ప్రస్తుతం టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులకు కమిటైందని టాక్ ఉంది. మరోవైపు ఈ భామ కెరీర్ బెటర్ మెంట్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఐశ్వర్య సోషల్ మీడియాల్లోను జరంత స్పీడ్ గానే ఉంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో గుబులు రేపుతోంది. ఐశ్వర్య వైట్ టాప్ రోజ్ కలర్ బాటమ్ లో అద్భుతమైన భంగిమలతో హొయలు పోయింది. నిజానికి ఈ అందమైన ఫిజిక్ కోసం నిరంతరం జిమ్ యోగా అంటూ చాలా శ్రమిస్తోంది ఈ భామ. ఐశ్వర్య మీనన్ అందచందాలు మంత్ర ముగ్ధం చేస్తున్నాయి! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మొదట తల్లిదండ్రుల అనుమతి లేదు..
ఐశ్వర్య మీనన్ తమిళనాడులో జన్మించిన భారతీయ నటి. తండ్రి పేరు వరద రాజన్. తల్లి పేరు జయ ముఖేష్ మీనన్ మేకప్ ఆర్టిస్ట్. ఆమెకు అభిషేక్ మీనన్ అనే అన్నయ్య ఉన్నాడు. ఈ కుటుంబానికి కేరళలో మూలాలు ఉన్నాయి. అయితే ఐశ్వర్య తమిళనాడులో పుట్టి పెరిగింది. నిజానికి ఐశ్వర్య ఎప్పుడూ నటి కావాలని కోరుకునేది. చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో పాల్గొనేది. డ్రామాలలో నటించేది. కళాశాలలో కూడా అలాంటి పోటీలలో చురుకుగా పాల్గొనడం కొనసాగించింది. ఐశ్వర్య మీనన్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయాలనేది పేరెంట్ ఆసక్తి. ఆమె తల్లిదండ్రులు మొదట సినిమాలకు అనుమతించలేదు.
చివరికి నటన అంటే తనకు ఉన్న అభిరుచిని తెలియజేసి అమ్మా నాన్నలను ఒప్పించగలిగింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆమె టెక్ కంపెనీలో కొంతకాలం పనిచేసింది. తరువాత నటి కావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. యువనటి ఐశ్వర్య పాఠశాల విద్యను నాగర్‌కోయిల్‌లోని సేతు లక్ష్మీ బాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేసింది. తరువాత ఉదయ ఇంజనీరింగ్ కళాశాలలో చేరింది. అక్కడ ఆమె ఇన్‌స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.