RTC క్రాస్ రోడ్ బాక్సాఫీస్.. దేవర బ్లాస్ట్ చేసేలా ఉంది

ట్రైలర్ వచ్చినప్పటి నుంచే కొంత నెగెటివ్ వైబ్ ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం గట్టిగానే ఉన్నాయి.

Update: 2024-09-24 07:06 GMT

సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ చూస్తుంటే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే కొంత నెగెటివ్ వైబ్ ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు ఎంతగానో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు.. ఇవన్నీ ఒకేసారి తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చర్చల్లో మునిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దేవర పై ఉన్న క్రేజ్ మరింతగా కనిపిస్తోంది. కృష్ణ, గుంటూరు, సీడెడ్ ప్రాంతాల్లో ఈ సినిమాపై నెలకొన్న హైప్ మాటల్లో చెప్పలేనిది. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఎన్టీఆర్ గ్రాండ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్ టాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకమైనదు. అక్కడి థియేటర్లు ప్రతి స్టార్ హీరోకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ గా కొనసాగుతున్నాయి. క్రాస్ రోడ్ థియేటర్లలో రికార్డు కొట్టడమనేది, ఫ్యాన్స్‌కు పెద్ద పండగ వంటిది. ఇప్పటివరకు క్రాస్ రోడ్ లో డే -1 కలెక్షన్లలో అగ్రస్థానంలో ఉన్న కల్కి, 87 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. రెండవ స్థానంలో గుంటూరు కారం 82 లక్షలతో ఉండగా, మూడవ స్థానంలో RRR 75.87 లక్షలతో ఉంది.

ఇప్పటి ట్రెండ్స్ చూస్తే, దేవర ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. క్రాస్ రోడ్‌లోని అన్ని థియేటర్లలో దేవర ను 7 షోలుగా ప్రదర్శించనున్నారు. బుకింగ్స్ మొదలుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే అన్ని షోలు హౌస్‌ఫుల్ అయిపోవడం విశేషం. మొత్తం 46 షోలను 7 ప్రధాన థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు దాదాపు 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇదే జరిగితే, RTC క్రాస్ రోడ్ చరిత్రలో డే-1లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా దేవర నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఒక సినిమా డే-1లో ఇలా రికార్డులు తిరగరాయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేవర సినిమా ఎంత క్రేజ్ కలిగి ఉందో అర్థమవుతోంది. మరి, సుదీర్ఘ కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా, రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదో చూడాలి.

Tags:    

Similar News