పిక్‌టాక్‌ : తలకిందులైన అందాల జాక్వెలిన్‌

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. విభిన్నమైన నెట్టెడ్‌ బ్లాక్ డ్రెస్‌లో జాక్వెలిన్‌ తల కిందులుగా ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది.

Update: 2024-12-28 07:49 GMT

శ్రీలంక ముద్దుగుమ్మ అయిన అందాల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రియాల్టీ షో ద్వారా ఇండియన్‌ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు బాలీవుడ్‌లో టాప్ స్టార్‌ హీరోయిన్స్‌ సరసన నిలిచింది. అందాల ఆరబోత చేస్తూ ప్రత్యేక పాటల్లో ఈమె చేసే డాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మాస్ కమ్యూనికేషన్‌లో పట్టా పొందిన ఈ అమ్మడు కొంత కాలం రిపోర్టర్‌గా శ్రీలంకలో చేసింది. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా మెల్ల మెల్లగా గ్లామర్‌ ప్రపంచానికి దగ్గర అయ్యింది. 2006లో మిస్ యూనివర్స్‌ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా 2006లో మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొంది.

మర్డర్ 2 సినిమాతో ఆమె హిందీ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. రేస్‌ 2 లోనూ నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్స్‌కి పోటీగా నిలిచింది. గడచిన పదేళ్ల కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. డాన్స్‌ షోలు, ఇతర రియాల్టీ షోల ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. విభిన్నమైన నెట్టెడ్‌ బ్లాక్ డ్రెస్‌లో జాక్వెలిన్‌ తల కిందులుగా ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. జాక్వెలిన్‌ ఎప్పుడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసినా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈమె అందాల ఆరబోత ఫోటోలు ఉన్నాయి. పైగా ఈసారి తల కిందులుగా ఉండి ఫోటోలకు ఫోజ్‌ ఇవ్వడంతో గుండె జారి గొంతులకు వచ్చినంత పనైంది అంటూ ఆమె ఫాలోవర్స్‌, సోషల్‌ మీడియా జనాలు జాక్వెలిన్‌ అందాల ఫోటోల గురించి ప్రముఖంగా కామెంట్స్ చేస్తూ తెగ లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.



ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతుంది. అందాల ఆరబోత పాత్రల్లోనే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నటించడం ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఏడాదిలో అమెరికన్‌ మూవీలో నటించడం ద్వారా హాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ముందు ముందు మరిన్ని ఇంగ్లీష్ సినిమాల్లో నటించాలని ఆశ పడుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఈమె నటించేందుకు ఆసక్తిని కనబర్చడం విశేషం.

Tags:    

Similar News