పబ్లిక్ లో కిస్.. మరోసారి బిగ్ బాస్ జంటపై ట్రోల్స్..!

హిందీ బిగ్ బాస్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దాదాపు 16 సీజన్లు పూర్తి చేసుకుంది.

Update: 2023-08-17 10:30 GMT

హిందీ బిగ్ బాస్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దాదాపు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. మధ్యలో ఓటీటీ సీజన్లు కూడా తీసుకువచ్చారు. రెండో ఓటీటీ సీజన్ రీసెంట్ గా అయిపోయింది. అయితే, ఈ షోలో ఉన్న సమయంలో ఓ జంట హాట్ టాపిక్ గా మారింది. వారు షోలో అందరూ చూస్తుండగా, కెమేరాలో రికార్డు అవుతుందని తెలిసి కూడా లిప్ లాక్ ఇచ్చుకున్నారు. అప్పుడు వివాదాలస్పదమైన ఈ జంట జాద్, ఆకాంక్షలు రీసెంట్ గా మరోసారి హాట్ స్పాట్ గా మారిపోయింది.

బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ అయిపోవడంతో ఈ జంట జాద్, ఆకాంక్షలు పబ్లిక్ ఈవెంట్ లో కలుసుకున్నారు. ఆ సమయంలో వీరు అందరూ చూస్తుండగానే ఒకరిని మరొకరు కిస్ చేసుకోవడం విశేషం. దీంతో, నెటిజన్లు వీరిని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షోలో ఏం చేయాలో, ప్రైవేట్ ఈవెంట్ లో ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా తెలీదా అని తిట్టిపోస్తున్నారు.

కాగా, ఆ సమయంలో సిల్వర్ కలర్ పొట్టి డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో కనిపించింది. ఇక జాద్ సింపుల్ గా వైట్ కలర్ షర్ట్ ధరించాడు. వారి పక్కనే కొందరు ఇతర కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. వారిని పట్టించుకోకుండా, వీరు ముద్దులు పెట్టుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వీరు, బిగ్ బాస్ షోలో ఒకరిని మరొకరు దాదాపు 30 సెకన్ల పాటు లిప్ లాక్ ఇచ్చుకున్నారు. ఈ వీడియో కూడా ప్రసారమైంది. ఈ ఘటనపై హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ జంటను వీకెండ్ ఎపిసోడ్ లో తిట్టడం గమనార్హం. అయితే, ఆ తర్వాతి వారమే ఆకాంక్ష షో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

తాను అలా చేయడానికి ఆమె ఒక రీజన్ కూడా చెప్పడం గమనార్హం. ఒక టాస్క్ లో భాగంగానే తాను ముద్దు పెట్టానని... టాస్క్ కింద తనకు 30 సెకన్ల సమయం ఇచ్చారని, దీన్ని టాస్క్ గానే భావించానని చెప్పింది. లిప్ లాక్ చేయాలనే ఆసక్తి తనకు లేదని... జైద్ స్థానంలో మరొకరు ఉన్నా తాను ఇదే పని చేసేదాన్నని తెలిపింది. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందనే విషయం తనకు ఆ సమయంలో తెలియలేదని చెప్పింది.

Tags:    

Similar News