ప్రభాస్ కి ఇవ్వడమే కాని తిరిగి అడగడం తెలియదు

తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి ఫ్యామిలీ గురించి మరియు ప్రభాస్ గురించి మాట్లాడుతూ వారిని ఆకాశానికి ఎత్తాడు.

Update: 2023-09-19 08:54 GMT

ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు స్టార్‌ హీరోలతో పోటీ పడిన సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ గా కెరీర్‌ లో దూసుకు పోతున్న జగపతిబాబు ఒకానొక సమయంలో ఆర్థిక సమస్యలతో సతమంత అయ్యారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి ఫ్యామిలీ గురించి మరియు ప్రభాస్ గురించి మాట్లాడుతూ వారిని ఆకాశానికి ఎత్తాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ... ప్రభాస్ కి ఇవ్వడమే తప్ప తిరిగి అడగడం తెలియదు. ఎవరు ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. నేను ఒకసారి సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభాస్ కి ఫోన్ చేశాను. అప్పుడు ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు.

విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే నా వద్దకు వచ్చాడు. డార్లింగ్ నేను ఉన్నాను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చాడు. ఆ సమయంలో ప్రభాస్ నాతో మాట్లాడిన మాటలు ఎప్పటికి మర్చి పోలేను. అతడు చేసిన సహాయం, చెప్పిన మాటలు నాకు చాలా ధైర్యంను ఇచ్చాయి అన్నాడు.

ఇక రాజమౌళి ఫ్యామిలీ గురించి జగపతి బాబు మాట్లాడుతూ... ఆ కుటుంబం మొత్తం కూడా ఎన్ని విజయాలు పొందినా, ఎన్ని అవార్డులు పొందినా కూడా చాలా సింపుల్ గా ఉంటారు. వారు హాలీడేస్ వెళ్లినా కూడా సినిమాల గురించి ఆలోచిస్తారు. సినిమా కోసం వారు ఎంత కష్టమైన పడుతారు. బంధువే కదా అని నేను ఎప్పుడు కూడా రాజమౌళిని ఆఫర్ అడగలేదు. అలాగే అతను కూడా మొహమాటంతో లేదా బంధుత్వంతో సినిమా ఆఫర్ ఇచ్చే రకం కాదని జగపతిబాబు అన్నాడు.

Tags:    

Similar News