జై హనుమాన్.. ఆ కళ్లు చూస్తుంటే అతనే అనిపిస్తోందా?
అయితే జై హనుమాన్ స్టోరీ అంతా ఆంజనేయుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు
దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో యూనివర్స్ ను క్రియేట్ చేశారు. అంతే కాకుండా.. ఆ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ ను కూడా ప్రకటించేశారు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రియుల దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్ మూవీపై పడింది.
ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగాా.. ఆరోజే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్ తో హనుమాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే జై హనుమాన్ స్టోరీ అంతా ఆంజనేయుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు కూడా చెప్పారు. అందుకే ఫస్ట్ పార్ట్ లో హనుమంతుడి ముఖాన్ని రివీల్ చేయలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరో ఎవరనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య ఈ సినిమాలో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. హనుమంతుడి కళ్లు చూసి చిరంజీవివేనని అంతా అనుకున్నారు. సినిమా విడుదల అయ్యాక తెలిసిపోద్ది అని ఫిక్సయ్యారు. కానీ సినిమాలో హనుమంతుడి ఫేస్ రివీల్ చేయకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అయితే చాలా మంది ఆ కళ్లను, సగం ఫేస్ చూస్తుంటే రానా దగ్గుబాటిలా అనిపిస్తుందని అంటున్నారు. కొందరు కచ్చితంగా ఆ కళ్లు రానావేనని చెబుతున్నారు.
అయితే రానా ఈ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. మన మనసులకు ఎంతో దగ్గరగా ఉండే అంశంతో హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కించారని అప్పుడు తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తొలి చిత్రానికే రెండు జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. రానా అలా దగ్గరగా ఉండడం, ఇప్పుడు హనుమాన్ సీన్స్ కు సంబంధించిన కళ్ళు అలానే ఉండడం ఈ గాసిప్స్ కు మరింత బలాన్ని ఇస్తోంది. మరి జై హనుమాన్ లో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఈ సీక్వెల్ 2025 లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.