జై హనుమాన్ కోసం మరో కొత్త ప్రపంచం!
అతడే కళా దర్శకుడు నాగేంద్ర.టి. గతంలో ఇతను ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'కల్కి'..'జాంబిరెడ్డి' లాంటి చిత్రాలకు పనిచేయడంతో అతడి అభిరుచుని..ఆలోచనని..విజన్ పట్టుకోగ లిగాడు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' ఇటీవల రిలీజ్ అయి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. పాన్ ఇండియాలో ఈసినిమా 300 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల్లో అతి పెద్ద చిత్రంగా నిలిచింది. సినిమాలో ప్రతీది అనుకున్నది అనుకున్నట్లు రావడంతోనే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా అంజనాద్రి అనే ఓప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించి ఎంత అందంగా..అద్భుతంగా చూపించారో తెలిసిందే. ఫాంటసీకి..రియాల్టీకి ఎంతో దగ్గరగా ఈ సెట్ నిర్మాణం చేపట్టి విజువల్ ట్రీట్ గా మలిచారు.
చుట్టూ పచ్చని వాతావరణం..ఎత్తైన కొండలు..మరోవైపు నది.. ఇలా పంచ భూతాల మధ్య అందమైన అంజనాద్రి ఎంతో ఆకట్టుకుంది. మరి ఈ సృష్టికి కారకుడు ఎవరు? అంటే అతన్ని కచ్చితంగా తలుచు కోవాల్సిందే. అతడే కళా దర్శకుడు నాగేంద్ర.టి. గతంలో ఇతను ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'కల్కి'..'జాంబిరెడ్డి' లాంటి చిత్రాలకు పనిచేయడంతో అతడి అభిరుచుని..ఆలోచనని..విజన్ పట్టుకోగ లిగాడు. అందుకే హనుమాన్ లో దర్శకుడు ఇమేజినేషన్ ని మించి అద్భుతమైన అంజనాద్రి ని రూపొం దించగలిగాడు.
ఈ సందర్భంగా నాగేంద్ర తను అనుభవాలు పంచుకున్నాడు. 'ప్రశాంత్ విజువల్ ఎఫెక్స్ట్ నుంచి రావడం వల్ల సెట్ వర్క్ పై అతడికి బాగా క్లారిటీ ఉంది. దేన్ని గ్రాఫిక్స్ లో చూపించాలి అన్న దానిపై ఓ క్లారిటీ ఉంది. అంతకు మంచి టైమ్ ని విజువల్ ఎఫెక్స్ట్ కోసం కేటాయించారు. దాని వల్ల ఇంత గొప్ప ఫలితం సాధ్యమైంది. హైదరాబాద్ దగ్గర వట్టినాగుల పల్లి లో ఓ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని సెట్ వేసాం. అందుకోసం 150 నుంచి 200 రోజులు సమయం పట్టింది. రకరకాల ఆకారాల్లో వందకు పైగా మణుల్ని తయారు చేసాం.
కొన్ని సన్నివేశాలు బాంబేలో జరుగుతున్నట్లు చూపించాం. కానీ అవన్నీ ఇక్కడ షూట్ చేసినవే. అలాగే మహర్షి సినిమా సెట్ ని వాడుకున్నాం. అందుకు మాయా వాళ్ల సహకారం తీసుకున్నాం. బడ్జెట్ పరిమి తులు ఉండటం వల్ల ఉన్న వనరులతోనే సినిమాని పూర్తిచేసాం. ప్రస్తుతం మేము అంతా 'జైహను మాన్' కోసం మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నట్లు' తెలిపారు.