వీడియో : 'యానిమల్‌' ఫుల్‌ జమాల్‌ జమాల్‌ చూశారా..!

యానిమల్‌ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు దాటుతున్నా కూడా ఇంకా సందడి తగ్గలేదు

Update: 2023-12-14 06:35 GMT

యానిమల్‌ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు దాటుతున్నా కూడా ఇంకా సందడి తగ్గలేదు. వెయ్యి కోట్ల వసూళ్లకి చేరువలో ఉన్న ఈ చిత్రం సోషల్ మీడియాలో సందడి కొనసాగిస్తూనే ఉంది. యానిమల్‌ సినిమాలోని పాత్రల గురించి, సన్నివేశాల గురించి అలాగే కొన్ని డైలాగ్స్ ఇలా ఏదో ఒక విషయం గురించి నెటిజన్స్ లు చర్చించుకుంటూనే ఉన్నారు.

సినిమా విడుదల అయినప్పటి నుంచి కూడా విలన్ ఎంట్రీకి సంబంధించిన సాంగ్‌ జమాల్ జమాల్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బిట్‌ సాంగ్‌ కి పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. విలన్‌ ఎంట్రీ సాంగ్ కి ఈ రేంజ్ ఆధరణ రావడం బహుషా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది.

జమాల్‌ జమాల్‌ పాటకు ఉన్న క్రేజ్ నేపథ్యం లో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్‌ వీడియో సాంగ్‌ ను విడుదల చేయడం జరిగింది. యూట్యూబ్‌ ను ఈ పాట కచ్చితంగా షేక్‌ చేయడం ఖాయం.. రికార్డ్‌ స్థాయి వ్యూస్ రావడం కూడా ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిట్‌ సాంగ్ తోనే తెగ ట్రెండ్‌ చేసిన నెటిజన్స్ ఇప్పుడు ఫుల్‌ సాంగ్‌ రావడంతో మరింతగా ఎంజాయ్ చేయడం ఖాయం. యానిమల్ సినిమాలో విలన్ అబ్రర్‌ హక్‌ గా బాలీవుడ్‌ నిన్నటి తరం స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కనిపించిన విషయం తెల్సిందే. ఆ పాటకి బాబీ డియోల్‌ అద్భుతంగా సెట్‌ అయ్యాడంటూ హీరో కంటే ఎక్కువ మార్కులు దక్కించుకున్నాడు.

రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్‌ సినిమా మొదటి పది రోజుల్లో దాదాపుగా 700 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేయడం ద్వారా కొత్త రికార్డ్‌ దిశగా దూసుకు పోతుంది. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన మరో సౌత్‌ దర్శకుడిగా సందీప్‌ వంగ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Full View
Tags:    

Similar News