జాన్వీ కపూర్ మాట తప్పింది ప్రేమకా? పెళ్లికా?
జాన్వీకపూర్ ..శిఖర్ పహారియాతో పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే.
జాన్వీకపూర్ ..శిఖర్ పహారియాతో పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూనే ఉంది. ముంబై పబ్ ల్లో పార్టీల నుంచి ప్రయివేట్ ఈవెంట్ల వరకూ ఈ జోడీ దొరకని పబ్ అంటే లేదు. ఇటీవలే అంబానీ ఇంట పెళ్లి వేడుకలో జంట ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో తెలిసిందే. ఇక గుడులు..గోపురాలు అంటూ తిరిగే విషయం గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
భారత్ లో ప్రఖ్యాత దేవాలయాలన్నింటిని ఇప్పటికే చుట్టేసారు. కుదిరితే మరోసారి చుట్టేయాలని చూస్తున్నారు. కానీ సమయం దొరకడం లేదు. జాన్వీ నటిగా బిజీగా ఉండటంతో శిఖర్ పహారియాకి తగినంత సమయం కేటాయించకలేకపోతుంది. అందుకే అమ్మడు తెలివిగా అంబానీ ఇంట పెళ్లి వేడుకను స్పాట్ చేసుకుని మూడు రోజులు ఎంజాయ్ చేసింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
అయితే జాన్వీ ఓ విషయంలో మాత్రం మాట తప్పింది. అది పెళ్లకై? లేక ప్రేమకై! అన్నది తెలియదు గానీ రెండళ్ల క్రితం నెట్ ప్లిక్స్ షోలో రిలేషన్ షిప్స్ గురించి అడిగితే రెండేళ్ల వరకూ ఆవిషయం నా మైండ్ లోకి రానివ్వనని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లేది లేదని తెలిపింది. కట్ చేస్తే ఈ గ్యాప్ లో నే శిఖర్ పహారియాతో దొరికింది. ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన లేదుకానీ అనధికారకంగా ఎన్నోసార్లు చిక్కారు.
అయితే ఆరోజు జాన్వీ చెప్పింది పెళ్లి గురించా? ప్రేమ గురించా? అన్నది క్లారిటీ మిస్ అవుతుంది. తాను కేవలం పెళ్లి గురించి ఆలోచించలేదని...ప్రేమ గురించి కాదని తాజా సన్నివేశాన్ని బట్టి అభిమానులు అవగతం చేసుకుంటున్నారు. ఎలాగూ జీవితానికి ఓ తోడు కావాలి. కాని అది ఇప్పుడే కాదని అందుకు సమయం పడుతుందని..అలాగని ప్రేమకు దూరం కాదనే విషయాన్ని అలా రివీల్ చేసిందని అంటున్నారు.