చిల్లీ కన్నా ఘాటుగా జాన్వీ అందం

తన తండ్రి ప్రోత్సాహంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

Update: 2023-12-27 14:04 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఈ అందాల భామ తన తొలి సినిమా ధడక్ తో హిట్ కొట్టేసింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. తన తండ్రి ప్రోత్సాహంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కథకు తగిన పాత్రలు ఎంచుకుంటూ.. అందంతో పాటు, నటనతో కూడా అభిమానులను సంపాదించుకుంది.


ఎవరూ ఊహించని విధంగా.. తెలుగులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీలో జాన్వీనే మెయిన్ హీరోయిన్. ఈ సినిమాలో జాన్వీ మత్స్యకారుడి కూతురిగా కనిపించనుంది. తంగం పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపైనే ఈ బ్యూటీ ఫోక‌స్ అంతా.


త‌న తెలుగు సినిమా డెబ్యూను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది జాన్వీ క‌పూర్. దేవ‌ర కోసం ఇటీవ‌ల బాలీవుడ్ సినిమాల‌ను కూడా త‌గ్గించుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డైలీ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.


జాన్వీ కపూర్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరోసారి హీట్ పెంచింది. రెడ్ కలర్ ఫుల్ టైట్ డ్రెస్ లో దిగిన ఫొటో షూట్ ను పోస్ట్ చేసింది. రెడ్ అండ్ వెట్ థీమ్తో ఈ ఫొటో షూట్లో సూపర్ పోజులిచ్చింది. సీజన్ గ్రీటింగ్స్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పోస్ట్ చేసిందో లేదో లైక్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. జాన్వీ పిక్స్ కు ఫైర్ ఎమోజీలతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ చిల్లీ కన్న ఘాటుగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇక ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు టాక్. మరికొన్ని నెలల్లో వీరి విహహం జరగనుందట. ఈ జంట కొన్ని రోజుల కింద మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయాన్ని దర్మించుకుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూడాలి మరి జాన్వీ పెళ్లి వార్తల్లో నిజం ఎంతో.

Tags:    

Similar News