తారక్ 'దేవర'.. జాన్వీ టార్గెట్ అదేనా?

బాలీవుడ్‌ స్టార్‌ పేరెంట్స్‌ శ్రీదేవి-బోనీ కపూర్‌ ముద్దుల కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ జాన్వీ కపూర్.

Update: 2024-05-23 05:25 GMT

బాలీవుడ్‌ స్టార్‌ పేరెంట్స్‌ శ్రీదేవి-బోనీ కపూర్‌ ముద్దుల కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ జాన్వీ కపూర్. వరుస చిత్రాలు చేస్తూ, విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన టాలెంట్ ను సినీ ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. బాలీవుడ్‌ కే పరిమితం కాకుండా.. టాలీవుడ్ లో కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఆఫర్లు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ధడక్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. దేవర సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. తంగం పాత్రలో ఆడియన్స్ ను అలరించనుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈపాటికే రిలీజ్ కావాల్సిన దేవర మూవీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నా.. జాన్వీ అప్పుడే ప్రమోషన్స్ చేసుకుంటోంది. అనేక చోట్ల దేవర కోసం మాట్లాడుతోంది. ఇటీవల మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ప్రమోషన్‌ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవరలో ఆమె చేస్తున్న రోల్ గురించి మాట్లాడింది జాన్వీ కపూర్.

దేవరలో తాను చేస్తున్న తంగం రోల్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంటుందని జాన్వీ చెప్పింది. సెట్స్ లో అందరూ ఎంతో ప్రేమగా ఉంటారని తెలిపింది. మూవీ యూనిట్ అంకితభావానికి ఆశ్చర్యపోయానని పేర్కొంది. దేవరలో నటించే ఛాన్స్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. తనకు అవకాశమిచ్చిన మేకర్స్ కు కృతజ్ఞతలు కూడా తెలిపింది. అయితే జాన్వీ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం వెనుక అసలు కారణమిదేనని ఓ టాక్ వినిపిస్తోంది.

దేవర మూవీతో భారీ కమర్షియల్ హిట్ కొట్టడమే జాన్వీ కపూర్ టార్గెట్ అని అంతా చెబుతున్నారు. తన కెరీర్ లో ఈ చిత్రం చాలా కీలకమని, అందుకే ఇప్పటి నుంచి హైప్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలకు గాను విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న జాన్వీ.. సరైన కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేదు. అందుకే దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తోంది. మరి ఈ మూవీతో ఆమె ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News