సౌత్ మార్కెట్ కోసం జాన్వి మాస్టర్ ప్లాన్..?

దేవర రిలీజ్ అవ్వకుండానే చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా జాన్వి ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

Update: 2024-02-29 08:30 GMT

శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సౌత్ మార్కెట్ మీద పూర్తి ఫోకస్ చేస్తుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులో ఎన్.టి.ఆర్ తో దేవర సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి పాత్ర కూడా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. దేవర రిలీజ్ అవ్వకుండానే చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా జాన్వి ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న RC16 వ సినిమాలో కూడా జాన్వి నటించడం ఆ సినిమాతో ఆమెకు ఆమెతో ఆ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలతో పాటుగా సౌత్ ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేందుకు సోలో ప్రయత్నాలు చేస్తుంది జాన్వి కపూర్. సౌత్ సినిమాల్లో కమర్షియల్ సినిమాలతో పాటుగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే జాన్వి కూడా అలాంటి ఒక ప్రయోగాన్ని చేయాలని చూస్తుందట.

కేవలం కమర్షియల్ సినిమాల్లో నటించినంత మాత్రాన స్టార్ క్రేజ్ వస్తుందని చెప్పడం కష్టం. కెరీర్ కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలంటే డిఫరెంట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే జాన్వి కపూర్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించాలని చూస్తుంది. తన మేనేజర్ కి సౌత్ నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి కథానాయికా ప్రాధాన్యత ఉన్న కథలు వచ్చినా సరే తాను చేస్తానని చెప్పిస్తుందట.

తెలుగులో శ్రీదేవి తన అభినయంతో స్టార్ రేంజ్ తెచ్చుకున్నారు. ఆమె పంథాలోనే జాన్వి కపూర్ అలాంటి ప్రయోగాలే చేయాలని చూస్తుంది. జాన్వి అలాంటి అటెంప్ట్ చేస్తే ఆమె సౌత్ కెరీర్ కి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. జాన్వి కపూర్ దేవర, ఆర్సీ 16 సినిమాలతో పాటుగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా ఓకే అనేస్తుంది. మరి జాన్వి కోరుకుంటున్న కథలు ఆమె దగ్గరకు వస్తాయా లేదా అన్నది చూడాలి. దేవర 1 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఎన్.టి.ఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై జాన్వి కపూర్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.


Full View


Tags:    

Similar News