ఎన్టీఆర్ తో డాన్స్ అంటే.. జాన్వీ క్రేజీ కామెంట్
ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ అయిన స్టార్ హీరోలు ఎవరంటే వెంటనే తెలుగు హీరోల వైపు అందరూ చూపిస్తారు
ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ అయిన స్టార్ హీరోలు ఎవరంటే వెంటనే తెలుగు హీరోల వైపు అందరూ చూపిస్తారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ టాప్ డాన్సర్స్ గా ఉన్నారు. హిందీలో డాన్స్ అంటే హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ నలుగురుని బీట్ చేసే డాన్సర్స్ ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై లేరని చెప్పొచ్చు. మెగాస్టార్ తర్వాత ఆ స్థాయిలో ఛరిష్మాటిక్ డాన్స్ తో అదరగొట్టే స్టార్స్ అంటే వీళ్ళే కనిపిస్తారు.
అయితే వీరందరిలో బెస్ట్ డాన్సర్ అంటే ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. తారక్ ఎలాంటి రిహార్శల్స్ లేకుండానే క్లిష్టతరమైన స్టెప్పులు అయిన కూడా ఈజీగా చేస్తాడని చాలా మంది ప్రశంసిస్తూ ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే డాన్స్ ప్రాక్టీస్ ముందుగానే చేస్తారు. తారక్ మాత్రం ఆన్ సెట్ లోనే అప్పటికప్పుడు స్టెప్పులు వేసి మెప్పిస్తాడు. అందుకే తారక్ తో డాన్స్ చేయడం చాలా కష్టం అని హీరోయిన్స్ సైతం అంటూ ఉంటారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడాన్ని ఆస్వాదిస్తామని చెబుతారు. కొరియోగ్రాఫర్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే స్టెప్పులు డిజైన్ చేస్తారు. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సాంగ్ షూట్ చేసారంట. ఈ సాంగ్ కి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో డాన్స్ కంపోజ్ చేశాడు. ఇది వరకు తెలుగులో శ్రీమంతుడు, ధృవ సినిమాలకి అతను వర్క్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో బాస్కో ఎన్టీఆర్ డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ సాంగ్ కోసం క్లిష్టతరమైన స్టెప్పులని కూడా చాలా ఈజీగా కంపోజ్ చేసాను. ఇదంతా ఎన్టీఆర్ వలనే సాధ్యం అయ్యింది. సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోతుంది. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారని బాస్కో చెప్పుకొచ్చారు. అలాగే దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ డాన్స్ పై ప్రశంసలు కురిపించింది.
విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లో ఎవరితో మీరు డాన్స్ చేయడానికి ఇష్ట పడతారు అని యాంకర్ ఓ ఇంటర్వ్యూలో అడిగారు. తాను జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి ఇష్టపడతానని జాన్వీ కపూర్ చెప్పింది. ఇప్పటికే దేవర మూవీలో ఓక సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేశాను. మరో సాంగ్ కూడా ఉంది. అందులో అతనితో కలిసి డాన్స్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.