వెనుక వైపు నుంచి జాన్వీకపూర్ కి అందుకే నచ్చదు!
బాలీవుడ్..టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఏ యువ భామ లేనంత బిజీగా ఉంది. మామ్ ఛరిష్మాతో ఛాన్సులొస్తున్నాయా?
జాన్వీ కపూర్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. బాలీవుడ్..టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఏ యువ భామ లేనంత బిజీగా ఉంది. మామ్ ఛరిష్మాతో ఛాన్సులొస్తున్నాయా?
ప్రతిభతో దక్కించుకుంటుందా? అన్నది పక్కనబెడితే అమ్మడు ఓ బ్రాండ్ లా మార్కెట్ లో ఫేమస్ అవుతుంది. ఇటీవలే 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'తో అలరించిన అమ్మడు త్వరలో 'ఉలజ్' తో మెప్పించడానికి రెడీ అవుతుంది.
ఈ సందర్భంగా అమ్మడు చురుకుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొం టుంది. ఈ సందర్భంగా ఫోటో గ్రాఫర్లతో, సోషల్ మీడియాలో నెటి జనులతో ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుని వెనుక నుంచి మాత్రం ఆపని వద్దు అనేసింది. ఇంతకీ ఏంటా పని అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. గతంలో మహి సినిమా ప్రమోషన్ లో వెనుక వైపు నుంచి జాన్వీ ఫోటోలు తీయెద్దు అన్న సంగతి గుర్తు చేసింది.
ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఈ నటి ఎవరో? చెప్పండని డిబేట్ పెట్టడం ఏమాత్రం బాగోలేదంది. కామెంట్ బాక్స్ లో నెటి జనుల కామెంట్లు ఇష్టానుసారంగా ఉంటున్నాయని అందుకే వెనుక నుంచి ఫోటోలు తీయోద్దు ప్లీజ్ అనేసింది. నన్ను అలా చూడటం నాకు కూడా నచ్చదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫోటో గ్రాఫర్లు కూడా నా ఇబ్బందిని గుర్తించారు.
ఇప్పుడు వాళ్లే ముందుకు తిరంగండి మేడం అని అడుగుతున్నారు. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కొంత మంది మా ఇష్టారీతున తీస్తామని మొండికేస్తారు. కానీ నాకు అలాంటి అనుభవం ఫోటో గ్రాఫర్ల నుంచి ఎదురవ్వలేదు. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని అంది.