చిచ్చు పెడుతున్న మ‌హి బాడీ సూట్

ఇప్ప‌టికే ఈ మూవీ థీమ్ ని ఎలివేట్ చేసే విధంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను టీమ్ వైవిధ్యంగా ప్లాన్ చేసింది.

Update: 2024-05-31 07:02 GMT

'మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి' ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటోంది జాన్వీ క‌పూర్. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుంటే, మ‌రోవైపు ప్ర‌చారంలో త‌గ్గేదేలే అంటూ జాన్వీ చెల‌రేగుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ థీమ్ ని ఎలివేట్ చేసే విధంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను టీమ్ వైవిధ్యంగా ప్లాన్ చేసింది.

డాక్ట‌ర్ వృత్తిలో ఉండే జాన్వీ క్రికెట్ కి వీరాభిమాని. క్రికెట్ ని అమితంగా ప్రేమించే త‌న భ‌ర్త కోరిక మేర‌కు తాను క్రికెట‌ర్ గా మారాల్సి వ‌స్తుంది. మ‌హిని అత‌డు ఎలా ఎంక‌రేజ్ చేసాడు? మ‌హిళా క్రికెట‌ర్ గా త‌న మేకోవ‌ర్ ఎలా సాగింది? అన్న‌ది తెర‌పై చూపించారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజ్ కుమార్ రావు క‌థానాయ‌కుడిగా న‌టించారు. అదంతా అటుంచితే జాన్వీ క‌పూర్ ఇంత‌కుముందు క్రికెటర్ దుస్తుల్లో విభిన్న‌మైన ప్ర‌చారంతో ఆక‌ట్టుకుంది. ఐపీఎల్ 2024 ఆద్యంతం జాన్వీ ప్ర‌చారం హోరెత్తించింది. తాను క్రికెట్ కోసం ఏకంగా 105 రోజులు ప్రాక్టీస్ చేసాన‌ని కూడా జాన్వీ తెలిపింది. మ‌హేంద్ర సింగ్ ధోనితో 06 నంబ‌ర్ తో ఉన్న క‌నెక్ష‌న్ గురించి కూడా జాన్వీ చాలా మాట్లాడింది.

ఇప్పుడు టోన్డ్ లుక్ ని ఎలివేట్ చేస్తూ స్పెష‌ల్ క‌స్ట‌మ్ మేడ్ బాడీ సూట్ లో కెమెరాల‌కు ఫోజులిచ్చింది జాన్వీ. ఈ క‌స్ట‌మ్ మేడ్ బాడీ సూట్ పై 'మ‌హి 06' అని రాసి ఉంది. నీలి రంగు షిమ్మ‌రీ బాడీ సూట్ కి ఎరుపు రంగు ప‌ట్టీల బార్డర్ కిరాక్ గా మిక్స‌యింది. బాట‌మ్ లో లూజ్ బ్లూ డెనిమ్స్ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం జాన్వీ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ లుక్ సంథింగ్ హాట్ అంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లైన‌ మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుందో కాస్త వేచి చూడాలి.

Tags:    

Similar News