RC16లో జాన్వీ లుక్ ఎలా ఉంటుందంటే?

టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ క‌పూర్ ల‌క్కీ గాళ్ అని అంగీక‌రించాలి. ఆరంభ‌మే ఈ బ్యూటీ క్రేజ్ స్కైలోకి చేరుకుంటోంది

Update: 2024-08-17 22:30 GMT

టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ క‌పూర్ ల‌క్కీ గాళ్ అని అంగీక‌రించాలి. ఆరంభ‌మే ఈ బ్యూటీ క్రేజ్ స్కైలోకి చేరుకుంటోంది. ఇంకా ఒక‌టో సినిమా అయినా రిలీజ్ కాకుండానే ఈ బ్యూటీకి తెలుగులో భారీగా ఫాలోవ‌ర్స్ పెరుగుతున్నారు. దీనికి కార‌ణం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోల‌తో వ‌రుస చిత్రాలు చేస్తుండ‌డ‌మే. మెగా నంద‌మూరి ఫ్యాన్స్ ఇప్పుడు జాన్వీని ఆరాధిస్తున్నారు. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అనుస‌రిస్తున్నారు.

దానికి త‌గ్గ‌ట్టే `దేవ‌ర` నుంచి జాన్వీ క‌పూర్ గ్లింప్స్ మైండ్ బ్లాక్ చేసింది. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి `చుట్టమల్లె` పాట విడుద‌లైంది. ఇది క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. దానికి కార‌ణం ఈ పాట‌లో జాన్వీ క‌పూర్ గ్లామ‌రస్ లుక్, డ్యాన్సింగ్ ఎబిలిటీ అన‌డంలో సందేహం లేదు. తార‌క్ తో పోటీప‌డుతూ ఎంతో క్లాసిక్ గా స్టెప్పులు వేసింది జాన్వీ. ఇక ఈ పాట‌లో చీర క‌ట్టులో ప‌ల్లె ప‌ట్టు అందాల‌ను ఎర వేసింది జాన్వీ. కోక ర‌వికెలో జాన్వీ అంద‌చందాల‌కు మ‌తులు చెడిపోయాయి.

తాజా స‌మాచారం మేర‌కు రామ్ చ‌ర‌ణ్ సినిమాలోను జాన్వీ లుక్ అభిమానుల‌కు స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ని తెలిసింది. జాన్వీ కపూర్ క్రేజీ న్యూ లుక్‌లో కనిపించనుందని.. ఇప్ప‌టికే ఫోటోషూట్ కూడా పూర్త‌యింద‌ని టాక్ వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు జాన్వీని కలిసాడు. ఫోటోషూట్ అనంత‌రం త‌న‌ లుక్ కూడా లాక్ అయింద‌ని వెల్ల‌డైంది. ఈ చిత్రంలో జాన్వీ డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. జాన్వీ పాటల్లో గ్లామరస్ అవతార్‌లో కనిపిస్తుందా లేదా? అన్న‌ది అటుంచితే... క్రీడా నేప‌థ్య చిత్రంలోని టాకీ పార్ట్‌లో డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చ‌ర‌ణ్‌- జాన్వీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags:    

Similar News