దేవర బ్యూటీ.. తప్పుకోవాలనుకుందట!
రెండు పార్ట్ లుగా రాబోతున్న దేవర సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు గత అయిదు సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు జాన్వీ కపూర్ తెలుగు లో దేవర సినిమాలో నటిస్తుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న దేవర సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తూ మరో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెల్సిందే. తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ హిందీలో ఇప్పటికే 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' లో నటించింది.
మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించబోతుంది. ప్రొఫెషనల్ క్రికెటర్ గా జాన్వీ కనిపించేందుకు గాను ఏకంగా రెండేళ్ల కఠిన శిక్షణ తీసుకుందట. తాజాగా ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా షూటింగ్ సమయంలో, క్రికెట్ ప్రాక్టీస్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది.
సహజత్వం కోసం ఆట ను పూర్తిగా నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేసే సమయంలో చాలా దెబ్బలు తగిలాయి. ఒకానొక సమయంలో నా రెండు చేతులు కనీసం కదిలించలేక పోయాను. నేను అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో నేను సినిమా నుంచి తప్పుకోవాలని భావించాను అంది.
దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో క్రికెట్ ను నేర్చుకుని సినిమాలో నటించాను. నా కష్టం తప్పకుండా ప్రేక్షకులకు వెండి తెరపై మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో కనిపిస్తుందని జాన్వీ హామీ ఇచ్చింది. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు, ఆమె సౌత్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాజ్ కుమార్ రావు హీరోగా శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రికెట్ స్టోరీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. తాను క్రికెట్ లో సాధించలేక పోయిన విజయాలను డాక్టర్ అయిన భార్య ద్వారా హీరో ఎలా సాధించాడు అనేది సినిమా కథ.
పాయింట్ చిన్నదే అయినా చూపించిన తీరు, స్క్రీన్ ప్లే బాగుంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. బాలీవుడ్ లో జాన్వీ ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అందుకోలేదు. మరి ఈ సినిమాతో అయినా జాన్వీ కి ఆ కమర్షియల్ సక్సెస్ దక్కేనా చూడాలి.