బంగారంలా మెరిసిపోతున్న ముద్దల తనయ!
సినిమా భామల నుంచి ఇతర రంగాల వరకూ హాజరైన అందాలన్నీ ఒకర్ని మించి ఒకరున్నారు.
అంబానీ ఇంట పెళ్లి వేడుకలో భాగంగా అందాలన్నీ అక్కడే కొలువు దీరిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ముంబై అందాల భామల మధ్య మెరిసిపోతుంది. అంబానీ ఇంటికి సమీపంలో ఎటు చూసినా కళ్లు చెదిరే అందాలే కనిపిస్తున్నాయి. వేడుకకు భారీ ఎత్తున హీరోయిన్లు అందరూ హాజరవ్వడంతో? స్పాట్ ఓ బ్యూటీ హాబ్ గా మారిపోయింది. ఎవరి స్టైల్లో వారు డిజైనర్ దుస్తుల్లో మెరిపించారు.
ముస్తాబు అవ్వడంలో ఒకరికొకరు పోటీ పడి మరీ అలంకరించుకున్నారు. ఏ ఒక్కరూ తీసేయలేని అందం. సినిమా భామల నుంచి ఇతర రంగాల వరకూ హాజరైన అందాలన్నీ ఒకర్ని మించి ఒకరున్నారు. ఈ అందాలన్నీ ఒక ఎత్తైతే పెళ్లి కూతురు,పెళ్లి కోడుకు బంగారు దుస్తుల్లో మెరవడం మరో ఎత్తు. బంగారం దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటుందో? అంబానీ చూపించాడు.
అయితే వీళ్లందర్నీ తలదన్నేలా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ న్యూ లుక్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే. డిజైనర్ లెహంగాలో జాన్వీ ఒదిగిన విధానం చూస్తే! అందమంతా జాన్వీకే సొంతమా అనడం ఖాయం. అంత అందంగా జాన్వీ మురిపిస్తుంది. నుదిటిన పాపిడి బొట్టు నుంచి..మెడలో ధరించిన హారం.. చేతులకు ఎంపిక చేసుకున్న గాజులు..చెవి బుట్టలు ప్రతీది జాన్వీని ఎంతో అందంగా మలిచాయి. బంగారు వర్ణం పోలిన లెహంగా పై టెంపుల్ జ్యువెలరీ అలంకరణ జాన్వీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
లెహంగా స్కర్ట్-విలాస వంతమైన బంగారు రంగులో బ్లౌజ్‌పై ఉన్న సాంప్రదాయ ఆభరణాలకు అనుగుణంగా ఎంతో క్రియేటివ్ గా కనిపిస్తుంది. ప్రముఖ స్టైలిస్ట్ అమీ పటేల్, అనుష్క దామిని దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వీ అందానికి అభిమాను లంతా ఫిదా అవుతున్నారు