జాన్వీకి అమ్మలా..అక్కలా ఆమె!
అప్పటి నుంచి జాన్వీ దృష్టిలో ఖుషీ కపూర్ తల్లిలా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ మరోసారి గుర్తు చేసుకుంది.
అమ్మ స్థానాన్ని చెల్లెలు తీసుకుంది. అక్క స్థానాన్ని చెల్లెలు తీసుకుంది. ఆమెకిప్పుడు అమ్మ-అక్కా-చెల్లి సర్వస్వం తానై జీవిస్తుంది. వయసులో చిన్నదైన మనసు ఎంత పెద్దతై ఆ చెల్లి అంతటి ప్రేమానురాగాలు కురిపిస్తుంది. కుటుంబమంటే ఎంత ప్రేమ లేకపోతే తన స్వేచ్ఛని సైతం పక్కనబెట్టి అక్క కోసం తన బాధని దిగమింగుకుంటుంది. నిజంగా ఈ చెల్లి-అక్కా కథ వింటే? ఎంతో స్పూర్తిదాయకంగానూ అనిపి స్తుంది.
ఇంతకీ ఎవరా అక్కా-చెల్లి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతిలోక సుందరి శ్రీదేవి మర ణంతో జాన్వీక పూర్-ఖుషీ కపూర్ తల్లి లేని బిడ్డలయ్యారు. దీంతో తల్లితండ్రి బాధ్యతలు బోనీకపూర్ తీసుకు న్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ తల్లి స్థానాన్ని మాత్రం ఆయన తిరిగి తేలేరు కదా? ఓ మహిళగా అన్ని రకాల బాధ్యతలు ఆయన నిర్వర్తించలేరుగా. అందుకే ఆ స్థానాన్ని ఖుషీ కపూర్ తీసుకుంది.
వయ సులో చిన్నదైన మనసు ఎంత పెద్దది అన్నది ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తల్లి మరణం సమయంలో చెల్లెలు ఎంతగా నిబ్బరంగా నిలబడి తనకి వ్యక్తిగత ధైర్యాన్ని ఇచ్చిందో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జాన్వీ దృష్టిలో ఖుషీ కపూర్ తల్లిలా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ మరోసారి గుర్తు చేసుకుంది.
'అమ్మ వదిలివెళ్లాక ఆ స్థానం నా చెల్లెలు ఖుషి తీసేసుకుంది. అమ్మలేని లోటు నాకు లేదు. నాది అమ్మ పోలిక.. ఖుషీది మా అమ్మమ్మ పోలిక. అందుకే ఖుషీ అంటే అమ్మకు ఎక్కువ ఇష్టం. 'ఇది మా అమ్మ' అంటూ ఎప్పుడూ అంటూ ఉండేది. ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ పోలికలతో ఉన్న నాకు అమ్మమ్మ పోలికలతో ఉన్న ఖుషి అమ్మ అయింది. ఇదే యాదృ చ్ఛికం అనుకుంటే. మా ఇద్దరి ఇష్టాయిష్టాలు అమ్మకు బాగా తెలుసు.
అందుకే ఏ విషయంలోనూ మాకు లోటుండేదికాదు. దానికి కారణం ఖుషి. అయితే.. తన ఇష్టాయిష్టాలు నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నేను తనని పట్టించుకోను. కానీ తను విశాలంగా ఆలోచించే మనిషి. నాకంటే మూడేళ్లు చిన్నదైనా తనకు పరిపక్వత ఎక్కువ. అందుకే తనెప్పుడూ బాగానే ఉంటుందన్నది నా నమ్మకం' అని జాన్వీ తెలిపింది.