జపాన్.. ఈ రేంజ్ దెబ్బ ఊహించలేదు

అయితే అతి కష్టం మీద సినిమాని వారం రోజులు థియేటర్స్ లో ఉంచి కలెక్షన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు

Update: 2023-11-17 03:54 GMT

కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జపాన్. ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాగా మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వస్తోంది. సినిమాలో కార్తి చేసిన జపాన్ క్యారెక్టరైజేషన్ అయితే అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. కాని రొటీన్ స్క్రీన్ ప్లే, డ్రామా మాత్రం ప్రేక్షకులకి నచ్చలేదు. దీంతో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని వీకెండ్ కి డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళిపోయింది.

అయితే అతి కష్టం మీద సినిమాని వారం రోజులు థియేటర్స్ లో ఉంచి కలెక్షన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. దీంతో జపాన్ మూవీని తీసేసి వేరే సినిమాలు ప్రదర్శించుకుంటున్నారు. ఈ వారం అజయ్ భూపతి మంగళవారం మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడున్న థియేటర్స్ స్పేస్ మంగళవారం సినిమాకి భాగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది.

ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న థియేటర్స్ సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. మరో విఅపు కార్తి కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా జపాన్ సినిమా మారిపోయింది. ఇటు తెలుగుతో పాటు తమిళంలో కూడా డిజాస్టర్ టాక్ నే సొంతం చేసుకుంది. మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేసే కార్తి జపాన్ విషయంలో కూడా మాత్రం కథ గురించి ఆలోచించకుండా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకొని ఉంటాడని భావిస్తున్నారు.

ఈ క్యారెక్టర్ ని కార్తి తన స్టైల్ లో డిఫరెంట్ గా ప్లే చేసే ప్రయత్నం చేశారు. అయిన ప్రేక్షకులని మెప్పించాలేకపోయారు. బుక్ మైషోలో ఈ సినిమాకి 5.1 మాత్రమే పబ్లిక్ రివ్యూ వచ్చింది. దీనిని బట్టి సినిమా ఏ స్థాయి డిజాస్టర్ అనేది అర్ధం చేసుకోవచ్చు. కార్తి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు.

గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న డ్రీమ్ వారియర్ వారికి ఇది అతి పెద్ద డిజాస్టర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే కార్తి నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఖాకీ, ఖైది సీక్వెల్స్ పైన ఫోకస్ పెట్టారు.

Tags:    

Similar News