పూనకాల గంగో రేణుక తల్లి వీడియో చూశారా!
ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. వీడియో సాంగ్‌కి మంచి స్పందన దక్కడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సొంతం చేసుకుని ఇండియాస్ టాప్ 3 జాబితాలో చేరింది. బాహుబలి 2 వసూళ్లకు అడుగు దూరంలో ఉన్న పుష్ప 2 కి నార్త్ ఇండియా నుంచి ఇంకా సాలిడ్ వసూళ్లు వస్తూనే ఉన్నాయి. నాలుగు వారాల తర్వాత కూడా అక్కడ నమోదు అవుతున్న వసూళ్లను చూస్తే మతి పోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతూ ఉన్నారు. బాలీవుడ్‌లో వచ్చిన బేబీ జాన్ సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా పుష్ప 2 వైపే జనాలు వస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.
పుష్ప 2 సినిమా విజయంలో జాతర సన్నివేశాలు కీలకం అనడంలో సందేహం లేదు. ఆ జాతర సన్నివేశాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. సినిమాలో వచ్చే గంగో రేణుక తల్లి పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా మంది థియేటర్‌లో ఆడవారికి పూనకాలు తెప్పించి, దేవుడు వచ్చేలా చేసిన ఆ పాటకు విశేష స్పందన వచ్చింది. అద్భుతంగా సాగిన ఆ పాటను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆధరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. వీడియో సాంగ్‌కి మంచి స్పందన దక్కడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. బాహుబలి 2 సినిమా వసూళ్లకు చేరువగా ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నెం.2 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ సైతం నార్త్ ఇండియా నుంచి భారీ ఎత్తున వసూళ్లు సొంతం అయితే కచ్చితంగా బాహుబలి 2 రికార్డ్‌లను బ్రేక్ చేయడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంధ్య థియేటర్ వివాదం వల్ల కాస్త ఇబ్బంది ఎదురైనా వసూళ్ల పరంగా యూనిట్ సభ్యులు సంతృప్తి చెందుతున్నారని చెప్పుకోవచ్చు.
సాధారణంగా ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అయితే కచ్చితంగా చిత్ర యూనిట్ సభ్యులు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసేవారు, ఓపెన్ గ్రౌండ్‌లో వేలాది మందితో అల్లు అర్జున్ అండ్ టీం మెంబర్స్ ఈవెంట్‌లో పాల్గొనే వారు. కానీ మహిళ మృతి చెందడంతో పాటు బాబు ఇంకా ఆసుపత్రిలోనే ఉండటం వల్ల చిన్న ఈవెంట్‌ను సైతం చేయలేక పోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్న కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదు అంటూ ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పుష్ప 2 వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముందు ముందు ఎక్కడికి ఈ వివాదం వెళ్తుంది అనేది చూడాలి.