జీవిత రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష షాకిచ్చిన కోర్టు.. బెయిల్ రిలీఫ్

వారికి ఏడాది జైలుశిక్ష.. రూ.5 వేల ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చింది.

Update: 2023-07-19 05:20 GMT

మెగాస్టార్ చిరంజీవికి జీవిత రాజశేఖర్ దంపతుల కు మధ్య పంచాయితీ మొదట్నించి ఉన్నదే. చిరంజీవి మీద సంచలన వ్యాఖ్యలతో షాకిచ్చిన ఉదంతానికి సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు వారిద్దరికి ఇబ్బందికరంగా మారింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద జీవిత రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నట్లుగా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారటమే కాదు.. షాకిచ్చేలా చేశాయి. దీని పై మెగా ఫ్యామిలీ తీవ్రంగా హర్ట్ అయ్యింది. జీవిత రాజశేఖర్ దంపతులు చేసిన వ్యాఖ్యల పై పరువు నష్టాన్ని కోరుతూ అల్లు అరవింద్ కోర్టును అశ్రయించారు.

చిరంజీవి పేరు తో నడుస్తున్న సేవా కార్యక్రమాల మీదా.. ట్రస్టు సేవల మీదా తప్పుడు ప్రచారాన్ని చేయటం పై అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. చిరంజీవి పరువు ప్రతిష్ఠల కు భంగం వాటిల్లేలా వ్యవహరించారని కోరుతూ.. వారి పై చర్యల కు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు పై సుదీర్ఘ విచారణ సాగుతోంది. తాజాగా నాంపల్లి లోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో భాగంగా జీవిత రాజశేఖర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు తప్పుగా కోర్టు నిర్దారించింది.

వారికి ఏడాది జైలుశిక్ష.. రూ.5 వేల ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చింది.అయితే.. కోర్టు పేర్కొన్న విధంగా రూ.5వేలు ఫైన్ ను చెల్లించటంతో..జైలుశిక్ష తీర్పు పై అప్పీలు కు అవకాశం ఇస్తూ రాజశేఖర్ దంపతుల కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. శిక్ష పడినా అప్పీలు కు బెయిల్ ఇవ్వటం జీవిత రాజశేఖర్ లకు రిలీఫ్ గా మారింది.

Tags:    

Similar News