చెన్నై వ్యాపారల్లోనూ బిజీగా ఉంటోన్న బ్యూటీ!
`జెర్సీ` తో హిట్ అందుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాద్ టాలీవుడ్ కి సుపరిచితమే. డెబ్యూ మూవీతోనే బెస్ట్ పెర్పార్మర్ అని నిరూపించుకుంది.
`జెర్సీ` తో హిట్ అందుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాద్ టాలీవుడ్ కి సుపరిచితమే. డెబ్యూ మూవీతోనే బెస్ట్ పెర్పార్మర్ అని నిరూపించుకుంది. నేచురల్ స్టార్ నాని తో రొమాంటిక్ సన్నివేశాల్లో సైతం ఆకట్టుకుంది. దీంతో అమ్మడు ఏ జానర్ సినిమాకైనా న్యాయం చేయగల నటి అన్నవిషయం త్వరగానే అర్ధమైంది. కానీ అమ్మడి కెరీర్ ఇక్కడ ఆశించిన విధంగా సాగలేదు. అందం..అభినయం..ప్రతిభ ఉన్న వాటికి తగ్గ అవకాశాలు రాలేదు.
`జెర్సీ` తర్వాత `కృష్ణా అండ్ హిజ్ లీల`..`జోడీ` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సొగసరి టాలీవుడ్ లో కనిపించలేదు. అవకాశాలు రాకపోవ డంతో మళ్లీ తమిళ్..కన్నడ..మలయాళం సినిమాల్లో బిజీ అయింది. తాజాగా మళ్లీ బాలీవుడ్ లో నూ రీలాంచ్ అవుతోంది. `లె టర్స్ టూ మిస్టర్ ఖన్నా` అనే చిత్రంతో మరోసారి అక్కడా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పటికే అమ్మడు అక్కడ `మిలన్ టాకీస్` అనే చిత్రంలో కొన్నేళ్ల క్రితమే నటించింది. అలాగే చాలా గ్యాప్ తర్వాత `సైంధవ్` లోనూ ఛాన్స్ అందుకుంది.
ఇలా శ్రద్దా కెరీర్ ఒకే భాషలో స్థిరంగా లేకుండా సాగుతోంది. కానీ నటిగా మాత్రం బిజీగానే ఉందండోయ్.ఇ క్కడ కాకపోతే మరో భాష అంటూ సినిమాలు చేస్తూనే ఉంది. మరి ఈ బ్యూటీ ఖళీ సమయం దొరికితే ఎం చేస్తుందో? తెలిస్తే! ఆమెలో ఇంత గొప్ప బిజినెస్ ఉమెన్ అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఎవరైనా ఖాళీగా ఉంటే వెకేషన్లకు చెక్కేస్తుంటారు. కానీ శ్రద్దా మాత్రం శ్రద్దగా బిజినెస్ పనుల్లో నిమగ్నమవుతుందిట. చెన్నైలో తల్లిదండ్రులు స్థాపించిన వ్యాపారాలు కొన్ని ఇప్పటికీ లాభాల్లో కొనసాగుతున్నాయిట.
ఖాళీ ఉంటే చెన్నైలో ఆ వ్యాపార పనుల్లోనే బిజిబిజీగా ఉంటుందిట. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అంటే అస్సలు నచ్చదుట. స్నేహితులతో బయటకు వెళ్లినా ఎక్కువ సేపు గడపదుట. మొత్తానికి అమ్మడిలో మంచి బిజినెస్ ఉమెన్ కూడా ఉందని తెలుస్తోంది. అలాగే అమ్మడు నల్లకోటు ధరించిన లాయరమ్మ అన్న సంగతి తెలిసిందే. నటి కాకముందు లాయర్ గా కొన్నాళ్లు ప్రాక్టీస్ చేసింది.