వేధింపులకు గురైతే నిరూపించాలి.. జానీ మాస్టార్ భార్య!
లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి ''జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం'' అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది... ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కూడా కనిపించలేదని సయేషా అన్నారు.
సహాయకురాలు ఆరోపణలతో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే ఈ వివాదంలో జానీ మాస్టార్ భర్య సుమలత అలియాస్ అయేషా అతడికి అండగా నిలిచారు. ఆరోపించిన యువతి నిజం నిరూపిస్తే తన భర్తను వదిలేస్తానని అయేషా ఛాలెంజ్ చేసారు.
జానీ మాస్టార్ ప్రతిభను అన్నివిధాలా ప్రోత్సహిస్తారని అయేషా అన్నారు. హైదరాబాద్‌లో.. అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆ యువతి దగ్గర డబ్బు లేకపోతే.. ముంబయి అసోసియేషన్ లో జానీ సభ్యత్వం ఇప్పించారని, తాను పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారని కూడా వెల్లడించారు.
స్టేజీ షోల నుంచి వచ్చిన సదరు యువతి మనస్తత్వాన్ని కూడా అయేషా రివీల్ చేసారు. ఆమె లగ్జరీ లైఫ్ కోరుకునేదని, తనకు ఎక్కువ ప్రాధాన్యతను ఆశించేదని కూడా జానీ మాస్టార్ సతీమణి అన్నారు. కొరియోగ్రాఫర్ గా ఎదగాలని, హీరోయిన్ గా స్థిరపడాలని ఆమె, ఆమె తల్లి కోరిక అని కూడా తెలిపారు. మైనర్‌గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యం ఏమిటి? జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఎవరైనా చూశారా? ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది? అంటూ అయేషా ప్రశ్నల వర్షం కురిపించారు.
లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి ''జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం'' అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది... ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కూడా కనిపించలేదని సయేషా అన్నారు. కొన్నేళ్ల క్రితం తనను జానీ మాస్టార్ లైంగికంగా వేధించారని యువ కొరియోగ్రాఫర్ ఆరోపించిన సంగతి తెలిసినదే.