ఎన్టీఆర్ కు ఇష్టమైన సినిమా ఏంటంటే..
మధ్యలో కెరీర్లో కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్న తారక్, టెంపర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచినవే.
జూ. ఎన్టీఆర్ అలియాస్ తారక్‌రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి హరికృష్ణ వారసుడిగా, నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. సింహాద్రి సినిమాతో అతి తక్కువ వయసులోనే రికార్డులను సృష్టించిన హీరోగా ఎన్టీఆర్ కు పేరుంది.
మధ్యలో కెరీర్లో కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్న తారక్, టెంపర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచినవే. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటించి తన సత్తాను పాన్ ఇండియా లెవెల్ లో పెంచుకున్నాడు ఎన్టీఆర్.
ఆర్ఆర్ఆర్ తర్వాత గతేడాది దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్న తారక్, ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. వార్2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక రాముడు సినిమా చేయనున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా అంటే ఎంతో ఇష్టమని చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సడెన్ గా నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ సినిమాకు స్వచ్చమైన ప్రేమ కథగా ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలున్నాయి. వీటిలో ముందుగా ఏఎం రత్నం నిర్మాణంలో చేస్తున్న హరిహర వీరమల్లును పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు.